News August 9, 2024
నాగచైతన్య, శోభిత ఎక్కడ కలిశారంటే?

సమంతతో 2021లో విడాకుల తర్వాత నాగచైతన్య కొంతకాలం సింగిల్‌గానే ఉన్నారు. 2022లో ‘మేజర్’ ప్రమోషన్లలో శోభితను చైతూ తొలిసారి కలిసినట్లు తెలుస్తోంది. చైతూ ఆమెకు తన కొత్త ఇంటిని చూపించడం, ఇద్దరూ ఒకే కారులో కనబడటంతో డేటింగ్ రూమర్స్ స్టార్టయ్యాయి. 2023 మార్చిలో ఇద్దరూ లండన్‌లో కలిసి దిగిన ఫొటో వైరల్ కావడంతో రిలేషన్‌షిప్ వార్తలు మరింత పెరిగాయి. తాజాగా డేటింగ్ వార్తలను నిజం చేస్తూ నిశ్చితార్థం చేసుకున్నారు.
Similar News
News October 27, 2025
సామాన్య కార్యకర్తను అందలం ఎక్కించాం: నాదెండ్ల

AP: సామాన్య కార్యకర్తను అందలం ఎక్కించిన ఏకైక పార్టీ జనసేన అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కొట్టే సాయిని శ్రీకాళహస్తి ఆలయ బోర్డు ఛైర్మన్‌గా ఎంపిక చేయడం దీనికి నిదర్శనమని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ యువతకు తగిన అవకాశం కల్పించాలని Dy.CM పవన్ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలన్నదే జనసేన లక్ష్యమని ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో మాట్లాడారు.
News October 26, 2025
గెలిస్తే వక్ఫ్ బిల్లును చెత్తబుట్టలో పడేస్తాం: తేజస్వీ

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమి గెలిస్తే వక్ఫ్ బిల్లును చెత్తబుట్టలో పడేస్తామని CM అభ్యర్థి, RJD నేత తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారు. ‘‘నా తండ్రి, RJD చీఫ్ లాలూ ప్రసాద్ దేశంలో మతతత్వ శక్తుల విషయంలో ఎప్పటికీ కాంప్రమైజ్ కారు. కానీ సీఎం నితీశ్ కుమార్ ఎప్పుడూ వారికి మద్దతిస్తారు. ఆయన వల్లే RSS రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతోంది. BJPని ‘భారత్ జలావో పార్టీ’ అని పిలవాలి’’ అంటూ వ్యాఖ్యానించారు.
News October 26, 2025
అల్పపీడనం, వాయుగుండం అంటే?

సముద్రంపై ఉండే వేడి గాలులు నీటి బిందువులను ఆవిరిగా మార్చి తక్కువ పీడనం ఉన్న వైపునకు పయనిస్తాయి. దీన్ని అల్పపీడన ద్రోణి అని అంటారు. ఈ ద్రోణి నీటి బిందువులను ఆకర్షిస్తూ అల్పపీడనంగా మారుతుంది. ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి తీరం వైపు వస్తుంది. ఆపై వాయుగుండం(31-50Kmph గాలులు)గా, మరింత బలపడితే తీవ్ర వాయుగుండం(51-62kmph గాలులు)గా ఛేంజ్ అవుతుంది. గాలుల వేగం 62Kmph దాటితే తుఫానుగా పరిగణిస్తారు.


