News June 26, 2024
ఇదెక్కడి కోఇన్సిడెన్స్ రా మామా!

ఈ T20WCలో అరుదైన యాదృచ్ఛిక ఘటన జరిగింది. IND, ENG కెప్టెన్లు రోహిత్, బట్లర్ ఇప్పటి వరకు ఆడిన ఇన్నింగ్సులు(6), చేసిన రన్స్(191), స్ట్రైక్ రేట్(159.16) ఒకేలా ఉండటం విశేషం. ఇదొక అద్భుతమని క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కెప్టెన్లు ఇద్దరూ తమ జట్లను ముందుండి నడిపించడమే కాకుండా పరుగులు కూడా చేస్తున్నారని పేర్కొంటున్నారు. కాగా రేపు రెండు టీమ్‌ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Similar News
News January 27, 2026
ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉంటే..

పంట కోత తర్వాత నిల్వ చేసే ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల అది వేడెక్కి రంగు మారుతుంది. అలాగే పురుగులు, శిలీంధ్రాలు ధాన్యాన్ని ఆశిస్తాయి. బూజు ఏర్పడి, ధాన్యం రంగు మారి వాసన వచ్చి నాణ్యత లోపిస్తుంది. సాధారణంగా వరి ధాన్యంలో తేమ శాతం 22-24% ఉన్నప్పుడు కోస్తారు. ఈ ధాన్యంలో తేమ 12 శాతానికి వచ్చేవరకు ఆరబెట్టి నిల్వ ఉంచితే పురుగు పట్టకుండా 6 నుంచి 12 నెలల వరకు కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
News January 27, 2026
దేశ చరిత్రలోనే అతిపెద్ద డీల్: మోదీ

EUతో కుదిరిన FTAని PM మోదీ చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. సంతకాలు పూర్తయిన అనంతరం మాట్లాడారు. భారత చరిత్రలోనే ఇది అతిపెద్ద ఒప్పందమని, ఇది మన ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తుందన్నారు. 5 ఏళ్లలో ఇన్నోవేషన్, డిఫెన్స్ రంగాల్లో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషించనుందన్నారు. గ్లోబల్ ట్రేడ్ కోసం IMEC కారిడార్‌ను డెవలప్ చేస్తూ అంతర్జాతీయ వ్యవస్థలో స్థిరత్వం కోసం భారత్-EU పనిచేస్తాయన్నారు.
News January 27, 2026
అతి త్వరలో సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల!

UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2026 నోటిఫికేషన్ ఈ వారంలోనే విడుదల కానుంది. జనవరి 14న నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండగా… అడ్మినిస్ట్రేషన్ కారణాలతో ఆలస్యమైంది. షెడ్యూల్ ప్రకారం మే 24న ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన లేదా డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తుకు అర్హులు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://upsc.gov.in/


