News June 9, 2024
తొలి ప్రధాని ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారంటే?

భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రమాణ స్వీకార కార్యక్రమం 1947 ఆగస్టు 15న రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగింది. అయితే ఈ హాల్‌లో ఎక్కువ మంది పట్టకపోవడం, అతిథులకు ఇబ్బందిగా ఉండటంతో 1990లో అప్పటి ప్రెసిడెంట్ వెంకటరామన్ రాష్ట్రపతి భవన్ ముందున్న ఖాళీ స్థలానికి ప్రమాణ స్వీకార వేదికను మార్చారు. ఆ సమయంలో ప్రధానిగా చంద్రశేఖర్ ఇక్కడే బాధ్యతలు తీసుకోగా అప్పటి నుంచి అదే వేదిక కొనసాగుతోంది.
Similar News
News September 13, 2025
48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు: మంత్రి

AP: రాష్ట్రంలో ఈ ఏడాది 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కోసం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా రూ.3,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. సూపర్ ఫైన్ రకం అంచనాలకు మించి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే రేషన్ బియ్యంలో నాణ్యత పెంచుతామని చెప్పారు.
News September 13, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 13, 2025
సెప్టెంబర్ 13: చరిత్రలో ఈ రోజు

1913: సినీ నటుడు సీహెచ్ నారాయణరావు జననం
1929: స్వతంత్ర సమరయోధుడు జతీంద్ర నాథ్ దాస్ మరణం
1948: హైదరాబాద్‌లోకి భారత సైన్యం ప్రవేశం
1960: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జననం
1960: సినీ నటుడు కార్తీక్ జననం
1965: నటి ముచ్చర్ల అరుణ జననం
1969: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ జననం
1989: సినీ రచయిత ఆచార్య ఆత్రేయ మరణం (ఫొటోలో)