News November 29, 2024

ఇదెక్కడి మాస్ రా మావా..!

image

మనకు నచ్చని పని చేసేందుకు వెనకాడుతున్నట్లే.. కప్పలు కూడా మగవాటితో సంభోగం ఇష్టం లేకుంటే అవి విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని కప్పలు మగవాటి దృష్టిని మళ్లించేందుకు చనిపోయినట్లు నటిస్తాయని కెమెరాలో రికార్డయింది. కలయిక ఇష్టం లేని సమయంలో దాన్నుంచి తప్పించుకోవడానికి కప్పలు వంటివి ఇలా ఆశ్చర్యకరమైన రీతిలో ప్రవర్తించడాన్ని గుర్తించారు. తెలివిగా కదలకుండా, కళ్లు మూసుకొని, నిర్జీవ స్థితిలో ఉంటున్నాయి.

Similar News

News December 24, 2025

చైనా గుబులు: AI ఎక్కడ తిరగబడుతుందోనని ఆంక్షలు

image

AI రేసులో ముందున్నామని ప్రకటిస్తున్న చైనా లోలోపల మాత్రం ఈ అత్యాధునిక టెక్నాలజీ పట్ల ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. స్వతంత్రంగా డేటాను విశ్లేషించి సమాధానాలిస్తున్న చాట్‌బాట్‌లు ఎక్కడ తమ కమ్యూనిస్టు ప్రభుత్వ విధానాలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయోనని కంగారు పడుతోందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. AI మోడల్స్ ట్రైనింగ్‌ దశలోనే ప్రభుత్వ వ్యతిరేక డేటాపై జాగ్రత్తలు తీసుకునేలా మార్గదర్శకాలు జారీ చేసింది.

News December 24, 2025

రేవంత్ వ్యాఖ్యలపై హరీశ్ రావు ధ్వజం

image

TG: వాదనలో విఫలమై, నిజాలు చెప్పే దమ్ము లేనప్పుడు వ్యక్తిగత దూషణలు మాత్రమే ఉంటాయంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. రేవంత్ రాక్షస భాషను, చిల్లర చేష్టలను, వెకిలి వేషాలను తెలంగాణ సమాజం సునిశితంగా గమనిస్తోందని తెలిపారు. అహంకారం తలకెక్కి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్న ఆయనను ప్రజలు క్షమించరని, 2028 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హరీశ్ ఫైర్ అయ్యారు.

News December 24, 2025

1.31 లక్షల మంది రైతులకు వ్యవసాయ పరికరాలు: తుమ్మల

image

TG: విపక్ష నేతల మాటలతో యాప్ అమలులో లేని జిల్లాల్లో రైతులు యూరియా ఎక్కువ కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎరువులపై విపక్షం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. త్వరలో రాష్ట్రమంతా యాప్ అమలు చేస్తామన్నారు. CM ఆదేశాలతో రైతు యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. దీనిద్వారా 1.31 లక్షల మంది రైతులకు వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందిస్తామని చెప్పారు.