News June 6, 2024

‘తప్పు ఎక్కడ జరిగింది’?.. వైసీపీ శ్రేణులను వేధిస్తున్న ప్రశ్న

image

AP: 151 MLAలున్న జగన్ పార్టీని ప్రజలు 11 సీట్లలోనే గెలిపించడంతో తప్పు ఎక్కడ జరిగిందనేది YCP అధినేత సహా ఆ పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. వైసీపీ కంచుకోటల్లోనూ కూటమి అభ్యర్థులు బంపర్ మెజార్టీలు సాధించడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పక్కా 90% YCP ఓట్లు, ఆ పార్టీకి పట్టున్న గ్రామాల్లోనూ కూటమికి మెజార్టీ రావడంతో తలలు పట్టుకుంటున్నారు. YCPపై ఇంత వ్యతిరేకతకు గల కారణాలు మీరు ఏమని అనుకుంటున్నారు.

Similar News

News November 15, 2025

ఢిల్లీ పేలుళ్ల ఘటన… అల్ ఫలాహ్ వర్సిటీపై కేసులు

image

ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటనలో ఢిల్లీ పోలీసులు హరియాణా అల్ ఫలాహ్ వర్సిటీపై 2 కేసులు నమోదు చేశారు. UGC, NAACలు వర్సిటీ అక్రమాలను గుర్తించిన తదుపరి మోసం, ఫోర్జరీ, తప్పుడు అక్రిడిటేషన్‌‌లపై కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇలా ఉండగా పేలుళ్లకు నేరపూరిత కుట్రకు సంబంధించి ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈ వర్సిటీపై ఇంతకు ముందు ఒక కేసును నమోదు చేశారు. పేలుళ్ల నిందితుల వివరాలు సేకరించి విచారిస్తున్నారు.

News November 15, 2025

డాక్టర్ డ్రెస్‌లో ఉగ్రవాది

image

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు నిందితుడు, జైషే మహమ్మద్ ఉగ్రవాది ఉమర్ డాక్టర్ డ్రెస్‌లో ఉన్న ఫొటో బయటకు వచ్చింది. మెడలో స్టెతస్కోప్ వేసుకుని కనిపించాడు. కాగా ఈనెల 10న జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. NIA, ఇతర భద్రతా సంస్థలు ఉమర్ నెట్‌వర్క్‌ గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఉమర్ ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీలో వైద్యుడిగా పని చేసేవాడు.

News November 15, 2025

ఇలాంటి ఫుడ్ రోజూ తింటే..

image

రెడీ టు ఈట్ ఫుడ్స్‌ను తరుచూ తీసుకుంటే 50 ఏళ్లలోపు వారిలో పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదం అధికంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. ‘రోజుకు మూడుసార్లు ప్రాసెస్డ్ ఫుడ్స్ తినేవారితో పోల్చితే 10సార్లు తినే మహిళల్లో అడెనోమా(క్యాన్సర్ కాని కణతులు) ముప్పు 45% ఎక్కువగా ఉంటుంది. ఇవే క్రమంగా క్యాన్సర్‌గా మారుతాయి’ అని USకు చెందిన JAMA ఆంకాలజీ పేర్కొంది. ఇందుకోసం 20 ఏళ్లలో 30వేల మందిపై సర్వే చేసినట్లు తెలిపింది.