News May 4, 2024
ఇవాళ సీఎం రేవంత్ ప్రచారం ఎక్కడంటే?

TG: సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు కొనసాగిస్తున్నారు. ఇవాళ ఆయన నాలుగు చోట్ల పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనజాతర సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు కొత్తకోట కార్నర్ మీటింగ్, 6:30 గంటలకు సికింద్రాబాద్, రాత్రి 8 గంటలకు ముషీరాబాద్ కార్నర్ మీటింగ్‌లకు హాజరు కానున్నారు.
Similar News
News December 9, 2025
ఆదిలాబాద్: “నేను మీ అభ్యర్థినే.. నాకెందుకు చేయరు ప్రచారం..”

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలకు వినూత్న అనుభవాలు ఎదురవుతున్నాయి. సర్పంచ్ అభ్యర్థుల ప్రచారానికి వెళ్ళినప్పుడు సొంత పార్టీ నుంచి రెబల్‌గా పోటీలో ఉన్నవారు వారిని ఇరకాటంలో పెడుతున్నారు. “మేము కూడా మీ పార్టీనే. ఇన్నేళ్లు పార్టీ కోసం కష్టపడ్డాం. ఇప్పుడు మీరు మాకు ఎందుకు మద్దతు ఇవ్వరు. మాకు కూడా ప్రచారం చేయండి” అని అడగడంతో నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
News December 9, 2025
2,569 పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ

RRBలో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇప్పటివరకు అప్లై చేసుకోనివారు చేసుకోవచ్చు. DEC 12వరకు ఫీజు చెల్లించవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, B.Sc ఉత్తీర్ణులై, 18- 33 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.35,400 చెల్లిస్తారు. www.rrbcdg.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 9, 2025
25 మంది మృతి.. థాయ్‌లాండ్‌కి పరారైన ఓనర్లు

గోవాలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన <<18501326>>అగ్నిప్రమాదం<<>>లో 25 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఘటన తర్వాత క్లబ్ ఓనర్లు గౌరవ్, సౌరభ్ లూథ్రా థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు పరారైనట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన ఐదు గంటల్లోనే డిసెంబర్ 7న ఇండిగో విమానం 6E 1073లో వారు దేశం విడిచినట్లు వెల్లడైంది. వీరిద్దరిపై పోలీసులు FIR నమోదు చేశారు. ప్రస్తుతం ఇంటర్‌పోల్ సహాయంతో వారి అరెస్ట్‌కు చర్యలు చేపట్టారు.


