News September 11, 2024
జనం అల్లాడుతుంటే కేసీఆర్ ఎక్కడ?: బండి సంజయ్

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘రాష్ట్ర ప్రజలు వరదలతో అల్లాడుతుంటే ఆయన బయటకు ఎందుకు రావడం లేదు? ప్రజలే KCRకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఆయనకు మళ్లీ రీ ఎంట్రీ కలే. KCR కుటుంబాన్ని జైల్లో వేయడం సీఎం రేవంత్కు సాధ్యం కావడం లేదు. బీజేపీ గెలిస్తే కేసీఆర్ అంతుచూసేటోళ్లం. ఆయనే దశమ గ్రహం. ఇంకా నవగ్రహ యాగం చేయడం విడ్డూరంగా ఉంది’ అని ఫైరయ్యారు.
Similar News
News October 29, 2025
తుఫాన్.. ప్రజలకు ఉచితంగా నిత్యావసరాలు

AP: మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలు, మత్స్యకారులకు ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేయనుంది. ప్రతి కుటుంబానికి 25కేజీల బియ్యం(మత్స్యకారులకు 50కేజీలు), లీటర్ నూనె, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, చక్కెర అందించనుంది. బియ్యం, కందిపప్పు, నూనె, చక్కెర సరఫరా వెంటనే ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించింది. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేయాలని మార్కెటింగ్ కమిషనర్కు సూచించింది.
News October 29, 2025
భారీ వర్షాలు.. కల్లాల మీద ధాన్యం ఉందా?

కోతకోసి కుప్ప మీద ఉన్న ధాన్యాన్ని బరకాలు కప్పుకొని రైతులు రక్షించుకోవాలి. నూర్చిన ధాన్యం రెండు మూడు రోజులు ఎండబెట్టడానికి వీలులేని పరిస్థితుల్లో ఒక క్వింటాలు ధాన్యానికి ఒక కిలో ఉప్పు, 20 కిలోల పొడి ఊక లేదా ఎండు వరిగడ్డిని కలిపితే గింజను వారం రోజులపాటు మొలకెత్తి చెడిపోకుండా నివారించుకోవచ్చు. ఎండ కాసిన తర్వాత ధాన్యాన్ని ఎండబెట్టి, తూర్పార పట్టి నిలువ చేసుకోవాలని ఏపీ వ్యవసాయ శాఖ సూచించింది.
News October 29, 2025
డౌన్స్ సిండ్రోమ్ పిల్లలకు ఈ పరీక్షలు చేయిస్తున్నారా?

డౌన్స్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు క్రమం తప్పకుండా కొన్ని వైద్య పరీక్షలు చేయించాలని వైద్యులు చెబుతున్నారు. ఏడాదికోసారి కంటి పరీక్షలు, 6-12 నెలలకు ఒకసారి చెవి పరీక్షలు చేయించాలి. ప్రతి ఆర్నెల్లకోసారి దంత పరీక్షలు, 3-5 ఏళ్లకోసారి ఛాతీ, మెడ భాగాన్ని ఎక్స్రే తీసి పరీక్షిస్తూ ఉండాలి. అమ్మాయిల్లో యుక్త వయసు రాగానే పాప్ స్మియర్ పరీక్ష, సంవత్సరానికోసారి థైరాయిడ్ పరీక్ష చేయిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.


