News November 10, 2024

ఎండ్రకాయ రూపంలో మహాదేవుడు.. ఎక్కడంటే?

image

AP: కార్తీకమాసంలో దర్శించుకోవాల్సిన ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో కడప(D) చిట్వేల్(M)లోని గుండాలకోన ఒకటి. విశ్వామిత్రుడు ఇక్కడ గుండాలేశ్వరస్వామిని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం. గుహలో ఎండ్రకాయ రూపంలో ఈశ్వరుడు దర్శనమిస్తాడు. ఇక్కడి గుండంలో మునిగి దేవుణ్ని దర్శించుకుంటే సర్వపాపాలు పోతాయని, సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. గుండాలకోన వెళ్లాలంటే వ్యయప్రయాసలకోర్చి 9కి.మీ అడవి బాటలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

Similar News

News November 13, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్

image

తిరుమల శ్రీవారిని సినీ నటుడు వరుణ్ తేజ్ ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. మట్కా సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో మూవీ టీమ్‌ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్నారు. నిన్న విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న వరుణ్ అండ్ కో అనంతరం తిరుమలకు వెళ్లారు. గత కొంతకాలంగా సరైన హిట్ లేని వరుణ్, మట్కాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. కరుణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించారు.

News November 13, 2024

తక్షణమే నీటి తరలింపు ఆపండి: KRMB

image

AP: జలవిద్యుదుత్పత్తి కోసం శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి జరుపుతున్న నీటి తరలింపును తక్షణమే ఆపాలని KRMB (కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్) పేర్కొంది. ఈ మేరకు AP, TG జలవనరుల శాఖ కార్యదర్శులకు లేఖ రాసింది. ఎగువ నుంచి వరద ఆగిపోయినా నీటి తరలింపు, విద్యుదుత్పత్తి చేయడం వల్ల నీటి నిల్వలు అడుగంటుతున్నాయని తెలిపింది. అటు APలో పోతిరెడ్డిపాడు, ఇటు TGలో సాగర్ ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.

News November 13, 2024

నేడు YS జగన్ ప్రెస్ మీట్

image

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇవాళ మ.3 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన మాట్లాడనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. రూ.2.94లక్షల కోట్ల బడ్జెట్ ప్రజలను నిరాశకు గురిచేసిందని ఇప్పటికే ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాము అసెంబ్లీకి హాజరుకాకుండా మీడియా ద్వారా ప్రశ్నిస్తామని జగన్ 3 రోజుల క్రితం ప్రకటించారు.