News December 11, 2024

2034లో ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ఎక్కడంటే?

image

ప్రతిష్ఠాత్మక 2034 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌కు సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఫిఫా ప్రకటించింది. మరోవైపు స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే దేశాలు సంయుక్తంగా 2030 వరల్డ్‌కప్ నిర్వహించనున్నాయని తెలిపింది. 2026 WCకు నార్త్ అమెరికా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక 2022లో అర్జెంటీనా ప్రపంచకప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Similar News

News November 27, 2025

ఇలా పడుకుంటే మొటిమల ముప్పు

image

సాధారణంగా మన చర్మం విడుదల చేసే నూనెలు, చెమట, బ్యాక్టీరియాతో పాటు మృతకణాలూ దిండు పైకి చేరతాయి. దిండు కవర్లను తరచూ మార్చకపోతే మొటిమల ముప్పు ఉంటుంది. అలాగే మేకప్ తొలగించకపోవడం, బోర్లా పడుకోవడం, గదిలో ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ ఎక్కువగా ఉండటం వల్ల కూడా చర్మం ఎక్కువ సీబమ్‌ను ఉత్పత్తి చేసి మొటిమలకు కారణమవుతాయి. కాబట్టి బెడ్‌రూంను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

News November 27, 2025

మరో తుఫాన్.. ‘దిట్వా’గా నామకరణం

image

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. ఇది బలపడి తుఫానుగా మారితే యెమెన్ సూచించిన ‘దిట్వా’ అని నామకరణం చేస్తారు. దిట్వా అనేది యెమెన్ సోకోత్రా ద్వీపంలోని ఫేమస్ సరస్సు పేరు. సెన్యార్ ఏర్పడిన సమయంలోనే ఈ అల్పపీడనం కూడా ఏర్పడిందని IMD తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఏపీ వైపు కదులుతూ బలపడే ఛాన్స్ ఉందని చెప్పింది.

News November 27, 2025

ఆధార్‌తో ఓటు హక్కు, పౌరసత్వం కుదరదు: సుప్రీంకోర్టు

image

చొరబాటుదారులు ఆధార్ పొందడంపై CJI జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. దేశపౌరులు కానివారికి ఆధార్ ఉంటే ఓటు హక్కు కల్పించాలా? అని ప్రశ్నించింది. ఓటరు జాబితాపై EC చేస్తోన్న SIRను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ‘సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా చూసుకోవడానికే ఆధార్. ఇది ఓటు హక్కు, పౌరసత్వం, నివాస స్థలాన్ని ఇవ్వదని చట్టంలో స్పష్టంగా ఉంది’ అని పేర్కొంది.