News April 20, 2024
ఏపీలో ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడంటే..

ఇవాళ ప్రకాశం(D) దరిమడగులో 44.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తిరుపతి(D) మంగనెల్లూరులో 43.9, చిత్తూరు(D) నింద్రలో 43.6 డిగ్రీలు నమోదైనట్లు పేర్కొంది. రేపు 45 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 197 మండలాల్లో వడగాల్పులు.. సోమవారం 70 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 116 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ప్రభావిత మండలాల లిస్ట్ కోసం ఈ <
Similar News
News March 4, 2026
బస్సుల్లో తగ్గిన పురుష ప్రయాణికుల సంఖ్య

AP: ‘స్త్రీ శక్తి’ పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. FEBలో నిత్యం 26 లక్షల మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు RTC తెలిపింది. దీంతో ఆక్యుపెన్సీ 92% దాటింది. అదే సమయంలో పురుషులు బస్సుల్లో ట్రావెల్ చేయడానికి జంకుతున్నారు. వారి సంఖ్య 37శాతానికి పడిపోయింది. బస్సుల్లో సీట్లు దొరకకపోవడమే దీనికి ప్రధాన కారణం. తాము డబ్బులు చెల్లిస్తున్నా సౌకర్యంగా ప్రయాణించలేకపోతున్నామని వారు వాపోతున్నారు.
News March 4, 2026
ఆయిల్ టెన్షన్ అక్కర్లేదు.. 8 వారాల నిల్వలు

ఇరాన్ ఉద్రిక్తతలు నెలల తరబడి కొనసాగొచ్చని విశ్లేషణలు వస్తున్నా భారత్‌లో చమురు సంక్షోభం తలెత్తే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మన వద్ద 8వారాలకు సరిపడా నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. హార్ముజ్ జలసంధి నుంచి వచ్చే చమురు 40% మాత్రమే కాగా.. ప్రత్యామ్నాయంగా క్రూడాయిల్ అందించేందుకు రష్యా ముందుకొచ్చింది. అటు హార్ముజ్ నుంచి వెళ్లే నౌకలకు రక్షణ కల్పిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు.
News March 4, 2026
7,948 MTS, హవల్దార్ పోస్టులు.. పరీక్ష ప్రైమరీ కీ విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 7,948 MTS, హవల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు నిర్వహించిన (CBIC & CBN) పరీక్ష ప్రైమరీ కీ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్‌షీట్‌ను చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరాలు ఉంటే రూ.50 చెల్లించి, మార్చి 6 వరకు తెలుపవచ్చు. వెబ్‌సైట్: https://ssc.gov.in


