News September 8, 2024

వినాయకుడు మానవ ముఖంతో కనిపించే ఏకైక ఆలయం ఎక్కడుందంటే..

image

వినాయకుడి విగ్రహమంటే గజ ముఖంతోనే చూస్తుంటాం. తమిళనాడులోని తిలాతర్పణపురి ఆదివినాయకర్ ఆలయంలో మాత్రం మానవముఖంతో ఉన్న గణనాథుడు దర్శనమిస్తాడు. అమ్మవారు పసుపు నలుగు నుంచి తయారుచేసి ప్రాణం పోసిన గణేశుడు పరమశివుడు తల ఖండించిన తర్వాత గజాననుడిగా మారాడు. అమ్మవారు తొలిగా చేసిన బుజ్జి గణపయ్య రూపమే ఇక్కడ పూజలందుకుంటోంది. ఇక్కడ పిండప్రదానం పితృదేవతలకు ముక్తిదాయకమని ప్రతీతి.

Similar News

News November 24, 2025

అది మీ తప్పు కాదు

image

ప్రేమలో విఫలం అయిన తర్వాత చాలామంది తమ లోపాల వల్లే అలా అయిందని బాధపడుతుంటారు. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు డిప్రెషన్‌కు కారణమవుతాయంటున్నారు నిపుణులు. వాళ్ల ఆలోచనలు, గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడం సరికాదు. సానుకూల దృక్పథం, స్వీయ ప్రేమను అలవర్చుకొని జీవితంలో ముందుకు సాగాలి. ఎంత ప్రయత్నించినా బాధ నుంచి బయటపడలేకపోతుంటే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.

News November 24, 2025

ముగిసిన ఐబొమ్మ‌ రవి విచారణ.. కీలక విషయాలు వెలుగులోకి!

image

మూవీ పైరసీ కేసులో ఐబొమ్మ రవి 5 రోజుల పోలీసు విచారణ ముగిసింది. స్నేహితుడు నిఖిల్‌తో కలిసి రవి డేటా హ్యాండ్లింగ్, సర్వర్ యాక్సెస్ వంటి అంశాల్లో పాల్గొన్నట్లుగా సమాచారం. టెలిగ్రామ్ యాప్ ద్వారా పైరసీ సినిమాల కొనుగోలు, USDT చెల్లింపులు, APK లింక్స్‌తో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసినట్లు తెలుస్తోంది. విచారణ ముగిశాక రవిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.

News November 24, 2025

కొడంగల్ వేదికగా స్థానిక ప్రచారం మొదలెట్టిన సీఎం

image

TG: 3-4 రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల ప్రచారాన్ని తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి ప్రారంభించారు. ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని, మహిళలు ఆ చీరలు కట్టుకొని అభివృద్ధికి అండగా నిలిచే వారికి ఓటేయాలన్నారు. పదేళ్లు అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కాగా త్వరలోనే 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు SEC షెడ్యూల్ విడుదల చేయనుంది.