News August 11, 2024

మధుమేహాన్ని తగ్గించే మొక్క.. ఎక్కడ ఉందంటే?

image

మధుమేహం చికిత్స కోసం తయారు చేస్తున్న బీజీఆర్-34 అనే ఔషధంలో CSIR పరిశోధకులు గుర్మార్ అనే మొక్కను ఉపయోగిస్తున్నారు. బిహార్‌లోని గయాలో ఉన్న బ్రహ్మయొని పర్వతంపై దీనిని గుర్తించారు. దీనికి మధుమేహాన్ని తగ్గించే లక్షణం ఉంది. ఈ మొక్కలో ఉండే జిమ్నెమిక్ యాసిడ్ తీపి పదార్థాలను తినాలనే కోరికను తగ్గిస్తుంది. బ్రహ్మయొని పర్వతంపై ఉన్న ఇతర మొక్కల ఔషధ గుణాలపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి.

Similar News

News October 29, 2025

పర్చూరు: వరదలో చిక్కుకున్న 20 మంది

image

తుఫాను కారణంగా పర్చూరు వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు సమీపంలో ఉన్న ఓ ప్రార్థన మందిరంలో 20 మంది చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసులు స్థానికుల సహకారంతో సురక్షితంగా బయటకు తెచ్చారు. వరదలో చిక్కుకున్న 20 మంది సురక్షితంగా బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News October 29, 2025

మహిళలు ఎక్కువ ఒత్తిడికి గురయ్యేది ఇందుకే!

image

తాను పనిచేస్తుంటే హెల్ప్ చేయకుండా ఫోన్ చూస్తూ విశ్రాంతి తీసుకుంటున్న భర్తను చూసి మహిళలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇది ఉద్యోగం కంటే కూడా ఎక్కువ స్ట్రెస్ ఇస్తుందని తేలింది. ఇంటి పనులు, వంట, పిల్లల సంరక్షణతో మహిళల్లో కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) స్థాయులు పెరుగుతాయి. ఇది సోమరితనం కాదని, బాధ్యతల్లో అసమతుల్యత అని నిపుణులు చెబుతున్నారు. *ఇంట్లో భార్యకు హెల్ప్ చేయండి బాస్

News October 29, 2025

భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 110 అప్రెంటిస్‌లు

image

సంగారెడ్డిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (<>BDL<<>>)లో 110 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. www.apprenticeshipindia.gov.in పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థులు టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కులు, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. డిప్లొమా, ఇంజినీరింగ్ అభ్యర్థులు అనర్హులు. వెబ్‌సైట్: https://bdl-india.in/