News February 28, 2025
చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి ఎక్కడ?: బుగ్గన

AP: ప్రజల తీర్పుతో మంచి పాలన చేయకుండా బడ్జెట్‌లోనూ YCPపై విమర్శలు ఎందుకని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. బడ్జెట్‌లో అసలు సూపర్ సిక్స్ అమలుకు కేటాయింపులు లేవని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతో ప్రజలు అప్పుల పాలయ్యారని తెలిపారు. సీఎం చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి ఎక్కడ జరుగుతోందో కూటమి నేతలు చెప్పాలన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారులో వృద్ధి ఎక్కడని నిలదీశారు.
Similar News
News February 28, 2025
శివరాత్రి వేళ రూ.కోటి దాటిన రాజన్న ఆలయ ఆదాయం

మహాశివరాత్రి రోజున వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రూ.1.31 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాదాల ద్వారా రూ.57.12లక్షల ఆదాయంరాగా కోడె మెుక్కుల ద్వారా రూ.45.83లక్షలు వచ్చిందని పేర్కొన్నారు. స్వామివారిని 2లక్షల 60 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చారు.
News February 28, 2025
ALERT.. రేపటి నుంచి జాగ్రత్త

AP: విజయవాడ కమిషనరేట్ పరిధిలో రేపటి నుంచి కొత్త వాహన రూల్స్ అమల్లోకి రానున్నాయి. హెల్మెట్ లేకుండా బైక్ నడిపే వారికి, వెనుక కూర్చొని పెట్టుకోని వారికి, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడింగ్‌కు ₹1000, ఇన్సూరెన్స్ లేకపోతే ₹2000(తొలిసారి), రెండోసారి ₹4000, లైసెన్స్ లేకుండా బండి నడిపితే ₹5000, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వారికి ₹1500, ఫోన్ మాట్లాడుతూ బండి నడిపితే ₹1500 ఫైన్ వేస్తామని పోలీసులు హెచ్చరించారు.
News February 28, 2025
సెమీస్‌కు ఆస్ట్రేలియా

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. 274 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియా 12.5 ఓవర్లలో 109 పరుగులు చేయగా మ్యాచుకు వర్షంతో ఆటంకం కలిగింది. ఈ క్రమంలో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ రాగా నాలుగు పాయింట్లతో ఆస్ట్రేలియా సెమీస్ చేరింది.