News February 27, 2025

మరణాన్ని ముందే గుర్తించే బావి.. ఎక్కడంటే?

image

అధ్యాత్మికతతో నిండిన వారణాసిలో ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలోని సిద్ధేశ్వరి మందిర్ ప్రాంగణంలో చంద్రుడు నిర్మించిన ‘చంద్రకూప్’ అనే బావి ఉంది. ఈ బావి నీటి కోసమే కాకుండా రాబోయే మరణాన్ని వెల్లడించే శక్తి కలిగి ఉందని భక్తులు నమ్ముతారు. పురాణాల ప్రకారం ఎవరైనా ఈ బావిలోకి చూస్తే వారి ప్రతిబింబం కనిపించకపోతే రాబోయే ఆరు నెలల్లో జీవితం ముగుస్తుందని, ఇది ఒక శకునమని చెబుతుంటారు.

Similar News

News November 4, 2025

నెల్లూరు సెంట్రల్ జైలుకు జోగి రమేశ్

image

AP: కల్తీ మద్యం కేసులో అరెస్టైన జోగి రమేశ్‌ను విజయవాడ నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. జైలు వద్ద ఆయనతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్, MLC చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. CBNను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని కాకాణి మండిపడ్డారు. TDPకి అంటుకున్న బురదను YCP నేతలపై చల్లుతున్నారని ఆరోపించారు. మరోవైపు రమేశ్‌ను అకస్మాత్తుగా నెల్లూరు జైలుకు ఎందుకు తరలించారని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

News November 4, 2025

నేపాల్‌లో ఏమైందో తెలుసు కదా?.. పోర్న్ బ్యాన్ పిల్‌పై సుప్రీంకోర్టు

image

దేశంలో పోర్నోగ్రఫీని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా నేపాల్‌లో జరిగిన Gen Z నిరసనలను ప్రస్తావించింది. ‘సోషల్ మీడియాను నిషేధించడం వల్ల నేపాల్‌లో ఏం జరిగిందో చూశారు కదా?’ అని CJI బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. 4 వారాల తర్వాత విచారిస్తామని స్పష్టంచేసింది. అయితే నవంబర్ 23నే జస్టిస్ గవాయ్ రిటైర్ కానుండటం గమనార్హం.

News November 4, 2025

రాత్రంతా ఆలోచిస్తూ, ఒంటరిగా ఉంటూ.. మృత్యుంజయుడి ఆక్రందన!

image

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడిన <<16688689>>మృత్యుంజయుడు<<>> రమేశ్ మానసికంగా కుంగిపోతున్నాడు. ‘ప్రమాదంలో తమ్ముడిని కోల్పోయా. ఆ ఘటన పదే పదే గుర్తొస్తోంది. రాత్రంతా ఆలోచిస్తూ, మేలుకొనే ఉంటున్నా. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నా. నా భార్యతో, కొడుకుతోనూ మాట్లాడటం లేదు. మానసికంగా బాధపడుతున్నా. 4 నెలలుగా అమ్మ మాట్లాడట్లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.