News August 21, 2024
ఈ జన్వాడ ఫామ్‌హౌస్ ఎక్కడుందంటే?

TG: జన్వాడ ఫామ్‌హౌస్ కూల్చివేతపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ ఫామ్‌హౌస్ రంగారెడ్డి(D), శంకర్పల్లి(M)లోని జన్వాడ(V)లో సర్వే నం.311/7లో ఉంది. 1210 స్క్వేర్ యార్డుల స్థలంలో 3,895.12 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. ఇది గండిపేట్ చెరువు(ఉస్మాన్ సాగర్)కు అతి సమీపంలో ఉంటుంది. చెరువులు, కాలువలను ఆక్రమించి నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చేస్తోంది.
Similar News
News November 22, 2025
మక్తల్: సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలి

సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 1న మక్తల్ పట్టణంలో పర్యటిస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం మక్తల్ తహశీల్దార్ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ వినీత్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి, కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం నారాయణపేట మక్తల్ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు.
News November 22, 2025
‘పండ్లు, కూరగాయల సాగుతో ఎక్కువ లాభం’

నారింజ పంట ఉత్పత్తికి నాణ్యమైన విత్తనాల కోసం నాగ్‌పూర్‌లో రూ.70 కోట్లతో క్లీన్‌ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. భూసార పరీక్షలు, నాణ్యమైన విత్తనాలను అందజేయడంపై ICAR సైంటిస్టులు దృష్టిపెట్టాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే పండ్లు, కూరగాయ పంటలను సాగు చేయాలని.. యంత్రాలు, డ్రిప్ ఇరిగేషన్ వాడకంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.
News November 22, 2025
ఇంగ్లండ్ ఆలౌట్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?

యాషెస్ సిరీస్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 164 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లిష్ బ్యాటర్లను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సక్సెస్ అయ్యారు. పోప్(33), డకెట్(28), జేమీ స్మిత్(15), అట్కిన్సన్(37), కార్స్(20) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4, స్టార్క్, డగ్గెట్ చెరో 3 వికెట్లు తీశారు. విజయం కోసం ఆస్ట్రేలియా 205 పరుగులు చేయాల్సి ఉంటుంది.


