News May 1, 2024
జనసేన ఉన్నచోట వేరేవారికి ‘గాజు గ్లాసు’ ఇవ్వం: EC
AP: స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై ఎన్నికల సంఘం స్పందించింది. జనసేన పోటీ చేసే స్థానాల్లో ఇండిపెండెంట్ MP, MLA అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయించట్లేదని హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. గాజు గ్లాసు గుర్తును కొందరు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంపై జనసేన పార్టీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. EC తాజా స్పందనతో విచారణ ముగిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
Similar News
News December 29, 2024
రేపు రాత్రి PSLV-C60 ప్రయోగం
అంతరిక్షంలో నిర్దిష్ట ప్రదేశంలో 2 స్పేస్‌క్రాఫ్ట్‌లను కలపడం – స్పేస్ డాకింగ్ ప్రయోగాలకు ఉద్దేశించిన PSLV-C60ని ఇస్రో సోమవారం ప్రయోగించనుంది. SpaDex మిషన్‌లో SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) ఉపగ్రహాలను నింగిలోకి పంపుతారు. ఆదివారం రాత్రి కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యే ఈ ప్రయోగాన్ని తరువాతి రోజు రాత్రి 8.58 గంటలకు నింగిలోకి పంపనున్నారు. స్పేస్ డాకింగ్ ప్రయోగం ఇస్రోకు కీలకం కానుంది.
News December 29, 2024
UGC నెట్ అడ్మిట్ కార్డులు విడుదల
UGC-నెట్ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, DOB, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి వీటిని పొందవచ్చు. 85 సబ్జెక్టులకు జనవరి 3 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు జరుగుతాయి. అడ్మిట్ కార్డులపై ఫొటో, బార్‌కోడ్, క్యూఆర్ కోడ్‌ను అభ్యర్థులు చెక్ చేసుకోవాలని, సరిగ్గా లేకుంటే మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ <
News December 29, 2024
నేను మరాఠీ.. నా పిల్లల్ని తెలుగులోనే చదివిస్తున్నా: మంత్రి సత్యకుమార్
AP: తాను మరాఠీ అయినా తన పిల్లల్ని తెలుగులోనే చదివిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మాతృ భాషలో చదువుకుంటేనే పిల్లలకు తెలివితేటలు వస్తాయని చెప్పారు. విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఆయన మాట్లాడారు. ‘సంస్కృతి, వారసత్వం అన్ని భాషతోనే ముడిపడి ఉంటాయి. ప్రస్తుతం చాలామందికి తెలుగు రాయడం, చదవడం రావడం లేదు. మన తెలుగు ఎప్పటికీ నిలిచి ఉంటుంది’ అని మంత్రి వ్యాఖ్యానించారు.