News May 12, 2024
జగన్, చంద్రబాబు, పవన్ ఎక్కడ ఓటు వేస్తారంటే?

రాష్ట్రంలోని ప్రధాన పార్టీల అధినేతలు రేపు పులివెందుల, మంగళగిరి నియోజకవర్గాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సీఎం జగన్ పులివెందుల నియోజకవర్గంలోని బాకరాపురంలో ఓటు వేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ కాలనీలో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
Similar News
News November 22, 2025
iBOMMA కేసు.. సీఐడీ ఎంట్రీ

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అతనిపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు 10కి పైగా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే మనీలాండరింగ్ అంశంపై ఈడీ ఆరా తీయగా, తాజాగా CID కూడా ఎంట్రీ ఇచ్చింది. గేమింగ్, బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేసిన వ్యవహారంపై వివరాలను అధికారులు సేకరించారు. ప్రస్తుతం అతడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు 3 రోజులుగా విచారిస్తున్నారు.
News November 22, 2025
బీస్ట్ మోడ్‌లో సమంత

ఒకప్పుడు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న నటి సమంత సడన్‌గా బీస్ట్ మోడ్‌లోకి వెళ్లారు. తాజాగా తన ఫిట్నెస్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ఆమె తన బ్యాక్, ఆర్మ్స్ మజిల్స్‌ను ఫ్లెక్స్ చేస్తూ తన అథ్లెటిక్ బాడీని చూపించారు. ఒకప్పుడు ఇలాంటి బాడీ తనకు సాధ్యం కాదని అనుకున్నానని, కానీ ఇప్పుడు సాధించానని చెప్పుకొచ్చారు. కాగా ఆమె ఫిట్నెస్కి అభిమానులు ఫిదా అవుతున్నారు.
News November 22, 2025
యాపిల్ కంటే చిన్న పసికందు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

ముంబైలో 350 గ్రాముల బరువుతో పుట్టిన చిన్నారి 124 రోజుల పాటు NICUలో చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ కావడం అద్భుతంగా నిలిచింది. జూన్ 30న ప్రీమెచ్యూర్‌గా (25 వారాల గర్భధారణ) జన్మించిన ఈ బిడ్డ యాపిల్ కంటే చిన్నగా ఉండేది. పుట్టిన తర్వాత అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఇటీవల డిశ్చార్జ్ అయింది. బిడ్డ బరువు 1.8 కిలోలకు పెరిగింది. దేశంలో ఇప్పటివరకు బతికిన అత్యంత తక్కువ బరువున్న శిశువుగా నిలిచింది. (PC: TOI)


