News August 6, 2024
ఆ నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే లోకల్
TG: ఇంజినీరింగ్ విద్యలో లోకల్, నాన్ లోకల్ ప్రామాణికతను ఉన్నత విద్యామండలి నిర్ధారించింది. విద్యార్థి 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏడేళ్లలో నాలుగేళ్లు ఏ రాష్ట్రంలో విద్యాభ్యాసం చేస్తే అక్కడ స్థానికుడిగా పరిగణిస్తామని తెలిపింది. బీటెక్ ప్రవేశాల్లో 15 శాతం నాన్ లోకల్స్కు కేటాయిస్తారు. ఏపీతోపాటు పలు రాష్ట్రాల విద్యార్థులు హైదరాబాద్లోని విద్యాసంస్థల్లో చదువుతున్న విషయం తెలిసిందే.
Similar News
News January 15, 2025
చీరాల: గంట వ్యవధిలో గుండెపోటుతో అన్నదమ్ముల మృతి
చీరాల గొల్లపాలెంలో బుధవారం తీవ్ర విషాద ఘటన జరిగింది. గంటల వ్యవధిలో అన్నదమ్ములు గుండెపోటుతో మృతిచెందారు. గొల్లపాలెంకు చెందిన గొల్లప్రోలు గంగాధర్ (40) గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే గంగాధర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అన్నయ్య మృతి తట్టుకోలేని తమ్ముడు గోపి( 33) అదే వైద్యశాలలో గుండెపోటుతో మరణించాడు.
News January 15, 2025
BIG BREAKING: KTRకు షాక్.. క్వాష్ పిటిషన్ డిస్మిస్
ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారణ జరగాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో కేటీఆర్ ఈ కేసులో విచారణ ఎదుర్కోనున్నారు. ఇప్పటికే ఏసీబీ ఒకసారి ఆయన్ని విచారించింది.
News January 15, 2025
‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. నిర్మాత ఆవేదన
‘గేమ్ ఛేంజర్’ రిలీజైన నాలుగైదు రోజుల్లోనే బస్సుల్లో, కేబుల్ ఛానల్స్లో ప్రసారమవడం ఆందోళన కలిగిస్తోందని నిర్మాత SKN ట్వీట్ చేశారు. ‘సినిమా అంటే కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతలే కాదు. ఇది 3-4 ఏళ్ల కృషి, అంకితభావం, వేలాది మంది కలల ఫలితం. ఇవి చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ముప్పు. ప్రభుత్వాలు దీనికి ముగింపు పలికేలా కఠిన చర్యలు తీసుకోవాలి. సినిమాను బతికించుకునేందుకు ఏకమవుదాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.