News September 29, 2024
నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందా లేదా అనేది అనవసరం: టీజీ వెంకటేశ్
AP: తిరుమల లడ్డూ వివాదం, సిట్ దర్యాప్తుపై మాజీ ఎంపీ, బీజేపీ నేత టీజీ వెంకటేశ్ హాట్ కామెంట్స్ చేశారు. ‘నెయ్యి కల్తీ జరిగిందంటే చాలు కేసు పెట్టొచ్చు. అందులో జంతువుల కొవ్వు ఉందా లేదా అనేది అనవసరం. నెయ్యి స్వచ్ఛంగా లేకుండా ఏది కలిపినా కల్తీ అయినట్లే. కత్తి లేదా తుపాకీతో చంపినా హత్యే అవుతుంది. శిక్ష ఒక్కటే. సిట్‌పై వైసీపీ నేతలకు నమ్మకం లేకపోతే సీబీఐపైన కూడా వారికి ఉండదు’ అని పేర్కొన్నారు.
Similar News
News December 21, 2024
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్ ఇదేనా?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ టోర్నీలో భారత్ మొత్తం 3 గ్రూప్ మ్యాచులు ఆడనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న పాకిస్థాన్, మార్చి 2న న్యూజిలాండ్‌తో టీమ్ ఇండియా తలపడుతుందని తెలుస్తోంది. కాగా గ్రూప్-1లో ఇండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఉంటాయని, గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఆఫ్గానిస్థాన్, సౌతాఫ్రికా ఉంటాయని సమాచారం.
News December 21, 2024
అల్లు అర్జున్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమా?
‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్‌గానే ఉన్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీలో ఘటనపై ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఆస్పత్రిలో ఉన్న బాలుడిని కాకుండా జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్‌ని సినీ ప్రముఖులు పరామర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ బెయిల్ రద్దవుతుందని, ఆయనకు జైలు తప్పదేమోనన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
News December 21, 2024
NTRతో మూవీ తర్వాతే KGF-3, సలార్-2: హొంబలే
హొంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన KGF విడుదలై నేటికి ఆరేళ్లు, సలార్‌కు రేపటితో ఏడాది పూర్తవుతున్నట్లు తెలుపుతూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ సినిమాల్లో నటించిన యశ్, ప్రభాస్‌లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం NTRతో తీసే సినిమాలో నీల్ బిజీగా ఉన్నారని తెలిపారు. ఆ తర్వాతే ఆయన KGF-3, సలార్-2 ప్రాజెక్టులు చేస్తారని వెల్లడించారు.