News September 14, 2024

Gen-Z తరంవారు ఎక్కువ ఏ యాప్స్ వాడుతున్నారంటే?

image

1990-2010 మధ్య పుట్టిన Gen-Z తరం వారు సోషల్ మీడియాలో ఎక్కువగా ఏ యాప్‌లు వాడుతున్నారన్నదానిపై ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం నిర్వహించింది. దాని ప్రకారం.. వారిలో 93శాతంమంది యూట్యూబ్ వాడుతున్నారు. ఇన్‌స్టా-78శాతం, ఫేస్‌బుక్-67శాతం, స్నాప్ చాట్-65శాతం, టిక్‌టాక్ 62శాతం, పింట్రెస్ట్-45శాతం, రెడిట్-44 శాతం, ట్విటర్-42శాతం, లింక్డ్‌ఇన్-32 శాతం, వాట్సాప్-32శాతం వాడుతున్నారని తేలింది.

Similar News

News December 2, 2025

కాకినాడ: ‘చంపేసి పారిపోయాడు.. ఇతను కనిపిస్తే చెప్పండి’

image

కాకినాడ రూరల్ ఇంద్రపాలేనికి చెందిన బేతా గంగరాజు (52) తన భార్యను గత నెల 30న హత్య చేసి పరారయ్యాడని ఇంద్రపాలెం ఎస్ ఐ వీరబాబు తెలిపారు. అతని ఆచూకీ తెలిసినవారు పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఎస్ఐ ఫోన్ 9440796521, సీఐ 9440796555 కు సమాచారం ఇవ్వాలన్నారు.

News December 2, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.280 తగ్గి రూ.1,30,200కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.250 పతనమై రూ.1,19,350 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,96,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 2, 2025

గొర్రెలకు సంపూర్ణ ఆహారం ఎలా అందుతుంది?

image

గొర్రెలకు మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు, విటమిన్లతో కూడిన సంపూర్ణ దాణా(ఆహారం) అందేలా జాగ్రత్త వహించాలి. అప్పుడే గొర్రె మందలు ఆరోగ్యంగా పెరుగుతాయి. మంచి దాణా వల్ల గొర్రెల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి వాటి మందలు వృద్ధిచెంది, పెంపకందారులకు అధిక ఆదాయం అందిస్తాయి. సరైన పోషకాహారం అందని తల్లి గొర్రెల వద్ద పిల్లలకు సరిపోను పాలుండకపోతే పిల్లలు సరిగా ఎదగక మరణిస్తాయి.