News November 21, 2024
భారత AQI రాజధానిగా ఏ నగరం బెటరంటే..
కాలుష్యం కారణంగా దేశ రాజధానిగా ఢిల్లీ సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ కాక క్యాపిటల్‌గా ఏ నగరాలు సెట్ అవుతాయి? వాయు నాణ్యత సూచీ(AQI) ఆధారంగా ఏ నగరాలైతే బెటర్ అన్నదానిపై ఇండియా టుడే ఓ జాబితాను ప్రచురించింది. అవన్నీ ఈశాన్యరాష్ట్రాలకు చెందినవే కావడం విశేషం. ఇంఫాల్(AQI-38), ఐజ్వాల్(52), ఈటానగర్(56), షిల్లాంగ్(58), దిస్పూర్(64), అగర్తల(65), గ్యాంగ్‌టక్(AQI-70) వాటిలో ఉన్నాయి.
Similar News
News November 24, 2024
‘ప్రభాస్-హను’ కోసం జైలు సెట్
ప్రభాస్‌తో హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న సినిమా కోసం ఫిల్మ్ సిటీలో జైలు సెట్ వేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సెట్‌పై అలీపోర్ జైలు, 1906 అని రాసి ఉంది. ఇది స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే కథ అని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా చేస్తున్నట్లు సమాచారం. ఆయన సరసన డాన్సర్ ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
News November 24, 2024
గవర్నర్‌ను కలిసిన హేమంత్.. 28న ప్రమాణస్వీకారం
నవంబర్ 28న ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొద్దిసేపటి క్రితం గవర్నర్ సంతోష్ గంగ్వార్‌ను కలిసిన హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఝార్ఖండ్‌లో జేఎంఎం ఆధ్వర్యంలోని ఇండియా కూటమి 56 స్థానాల్లో విజయం సాధించడం తెలిసిందే. కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, CPI(ML)L 2, ఎన్డీయే 24 స్థానాల్లో గెలుపొందాయి.
News November 24, 2024
డేవిడ్ మిల్లర్‌ను ఎంతకు కొనుగోలు చేశారంటే?
డెత్ ఓవర్లలో హార్డ్ హిట్టింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపించే డేవిడ్ మిల్లర్‌ను లక్నో జట్టు రూ.7.5కోట్లకు కొనుగోలు చేసింది. గత ఐపీఎల్ సీజన్‌లో మిల్లర్ గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.