News November 3, 2024

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ కమిషన్ వేయాలి?: KTR

image

TG: సీతారామ ఎత్తిపోతల పథకంలో అనుమతులు లేకుండానే రూ.1074 కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలిచారని రాష్ట్ర ప్రభుత్వాన్ని KTR ప్రశ్నించారు. ‘కాళేశ్వరంపై కమిషన్ వేసిన మీపై ఇప్పుడు ఏ కమిషన్ వేయాలి? ఢిల్లీ నేస్తం – అవినీతి హస్తం’ అంటూ Xలో విమర్శలు చేశారు. ఉచిత చేపల పంపిణీ చేయకుండా మత్స్యకారుల జీవితాల్లో రేవంత్ సర్కార్ మట్టికొట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో పథకాలు నామరూపాలు లేకుండా పోయాయని అన్నారు.

Similar News

News December 27, 2024

ప్రజలకు ‘ఉపాధి’ కల్పించింది ఆయనే..

image

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు పని క‌ల్పిస్తున్న ఉపాధి హామీ ప‌థ‌కాన్ని మ‌న్మోహ‌న్ సింగ్ హయాంలోనే ప్రారంభించారు. 1991లో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలను ప్రధానిగా ఆయన కొనసాగించారు. తద్వారా విదేశీ పెట్టుబడులు, ప్రైవేటీకరణ, లైసెన్సింగ్ విధానాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అమెరికాతో అణు ఒప్పందం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, స‌మాచార హ‌క్కు చ‌ట్టం వంటి కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు పునాది వేశారు.

News December 27, 2024

సీఎం-సినీ ప్రముఖుల భేటీపై పూనమ్ కౌర్ ట్వీట్

image

సీఎం రేవంత్ రెడ్డి, సినీ ప్రముఖుల భేటీపై హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించారు. ‘ఈ మీటింగ్‌ను చూస్తే ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి సమస్యలు లేవని తెలుస్తోంది. హీరోలకు ఏవైనా వ్యాపార సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ఇండస్ట్రీ అండగా ఉంటుంది’ అని ఆమె సెటైర్ వేశారు. ఇవాళ సీఎంతో జరిగిన భేటీలో ఇండస్ట్రీ నుంచి ఒక్క నటి కానీ మహిళా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కానీ ఎవరూ పాల్గొనలేదు. దీనిని ఉద్దేశించే ఆమె ట్వీట్ చేశారు.

News December 27, 2024

ఆస్పత్రి నుంచి అద్వానీ డిశ్చార్జి

image

బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ (97) ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన కోలుకుని ఆరోగ్యంగా ఉండటంతో వైద్యులు ఇంటికి పంపారు. కాగా కొద్ది రోజులుగా అద్వానీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 12న ఆయన ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. డా.వినీత్ సూరి ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందించగా పూర్తిగా కోలుకున్నారు.