News October 25, 2025
కార్తిక మాసంలో ఏరోజు పవిత్రమైనది?

కార్తీక మాసంలో ప్రతి దినం భగవత్ చింతనకు శ్రేష్ఠమైనదే. అయితే కార్తీక సోమవారాలు శివుడికి ప్రీతికరమైనవి. ఈ రోజున ఉపవాసం, రుద్రాభిషేకం చేసేవారికి ఆయన అనుగ్రహం లభిస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసికోట, ఉసిరి చెట్టును పూజించడం శుభాలకు మూలం. కార్తీక పౌర్ణమి ఈ మాసానికి శిఖరాయమానం. ఈ రోజున చేసే నదీ స్నానం, దీపారాధన ద్వారా శివకేశవుల అనుగ్రహం లభించి, జన్మజన్మల పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
Similar News
News October 25, 2025
మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు!

AP: టెన్త్ పరీక్షలు వచ్చే ఏడాది MAR 16 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. NOV 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పించనున్నారు. ఈ ఏడాది కొత్తగా హాల్ టికెట్ల వెనక QR కోడ్ ఇవ్వనున్నారు. దాన్ని స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం రూట్ మ్యాప్ రానుంది. అటు చదువులో వెనకబడిన విద్యార్థుల కోసం 100డేస్ ప్రణాళికను DEC నుంచి అమలు చేయనున్నారు.
News October 25, 2025
డ్రగ్స్ కేసు.. సినీ నటులకు ఈడీ సమన్లు

డ్రగ్స్ కొనుగోలు కేసులో సినీ నటులు <<16798985>>శ్రీరామ్<<>>(శ్రీకాంత్), కృష్ణకు ఈడీ సమన్లు జారీ చేసింది. జూన్‌లో ప్రదీప్ కుమార్ అనే వ్యక్తికి మత్తు పదార్థాలు సప్లై చేసినందుకు జాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో వీరి హస్తం ఉందని విచారణలో తేలడంతో అరెస్టు చేయగా జుడీషియల్ రిమాండ్ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసు EDకి చేరడంతో ఈ నెల 28న శ్రీకాంత్, 29న నటుడు కృష్ణ దర్యాప్తునకు రావాలని కోరింది.
News October 25, 2025
సన్‌స్క్రీన్ ఎలా వాడాలంటే?

కాలంతో సంబంధం లేకుండా సన్‌స్క్రీన్ రోజూ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ముఖం, మెడకు రాయాలి. బయటికి వెళ్లేందుకు 15నిమిషాల ముందు రాసుకోవాలి. తేమ ఎక్కువగా ఉన్నా, చెమట పట్టినప్పుడు, స్విమ్మింగ్ తర్వాత సన్‌స్క్రీన్ మళ్లీ రాసుకోవాలి. సున్నితమైన చర్మం ఉన్నవారు జింక్ ఆక్సైడ్ లేదా టైటానియం డయాక్సైడ్ ఉండే మినరల్-బేస్డ్ సన్‌స్క్రీన్‌లను వాడడం మంచిదని సూచిస్తున్నారు.


