News December 7, 2024

మొబైల్ డేటా, వైఫై ఏది వాడితే మంచిది?

image

మొబైల్ డేటా కంటే వైఫైతో ఇంటర్నెట్ వాడుకోవడం బ్యాటరీకి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ డేటా ఉపయోగిస్తే సిగ్నల్ కోసం వెతుకుతూ ఫోన్ ఎక్కువ ప్రాసెసింగ్ చేస్తుందని, దీనివల్ల బ్యాటరీ త్వరగా ఖర్చవుతుందంటున్నారు. అలాగే 3G, 4G, 5G నెట్‌వర్క్స్ మధ్య స్విచ్ అవడం వల్ల బ్యాటరీ ఫాస్ట్‌గా డ్రెయిన్ అవుతుంది. వైఫై సిగ్నల్ స్ట్రాంగ్, స్థిరంగా ఉంటుందని దీనివల్ల తక్కువ పవర్ అవసరం పడుతుందని పేర్కొంటున్నారు.

Similar News

News October 25, 2025

రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ పదవి రద్దు

image

TG: గతంలో ఉన్న జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు అన్ని జిల్లాల అదనపు కలెక్టర్ల(రెవెన్యూ)ను ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ భూ సర్వే, హక్కుల నిర్ధారణ, సెటిల్‌మెంట్ పనులను వీరి పరిధిలోకి తెచ్చింది. అటవీ భూముల పరిరక్షణకు అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

News October 25, 2025

అన్ని రాష్ట్రాలకు ‘హైడ్రా’ అవసరం: పవన్

image

హైడ్రా లాంటి వ్య‌వ‌స్థ APతో పాటు అన్ని రాష్ట్రాల‌కు అవ‌స‌ర‌మ‌ని Dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. పాల‌కుల ముందుచూపు, నిబ‌ద్ధ‌తగ‌ల అధికారుల ప‌నితీరు ఏ వ్య‌వ‌స్థ‌కైనా మంచి పేరు తీసుకువస్తుందన్నారు. దేశంలోనే మొట్ట‌మొద‌టిగా హైడ్రా రూపంలో స‌రికొత్త వ్య‌వ‌స్థ‌ను TG ప్ర‌భుత్వం తీసుకురావడం అభినందనీయమని చెప్పారు. ఇవాళ మంగళగిరి క్యాంప్ ఆఫీస్‌లో పవన్‌ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

News October 25, 2025

US, EU ఆంక్షలను పాటిస్తాం: రిలయన్స్

image

రష్యా చమురు కంపెనీలపై అమెరికా, ఈయూ ఆంక్షలను పాటిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. వాటి మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటామని, ఆంక్షల ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని వెల్లడించింది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా రష్యాలోని అతిపెద్ద చమురు కంపెనీలు రాస్‌నెఫ్ట్, లాకాయిల్‌పై అమెరికా, ఈయూ ఆంక్షలు విధించాయి. ఆ రెండు సంస్థలతో వ్యాపారాన్ని నవంబర్ 21 నాటికి ముగించాలని రిఫైనరీలను ఆదేశించాయి.