News October 23, 2024

ఇండియాలోనే అత్యంత నెమ్మదైన రైలు ఏదంటే..

image

హౌరా-అమృత్‌సర్ రైలుకు అత్యంత నెమ్మదిగా గమ్యం చేరే రైలుగా పేరుంది. 111 స్టేషన్లలో ఆగుతూ వెళ్లడం వల్ల ఆఖరి స్టేషన్‌కు చేరుకునేందుకు 37 గంటలు పడుతుంటుంది. బెంగాల్, బిహార్, యూపీ, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల మీదుగా 1910 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈరోజు రాత్రి 7.15 గంటలకు హౌరా స్టేషన్లో బయలుదేరితే ఎల్లుండి ఉదయం 8.40 గంటలకు అమృత్‌సర్ చేరుతుంది. టికెట్ ధర తక్కువే కావడంతో ఈ రైలుకు డిమాండ్ ఎక్కువే.

Similar News

News October 23, 2024

మోసపూరిత ప్రకటనల కట్టడికి Facebook, Instagramలో కొత్త ఫీచర్

image

సెల‌బ్రిటీల చిత్రాల డీప్ ఫేక్ ద్వారా వ్యాపార ప్ర‌క‌ట‌న‌ల రూపంలో జ‌రుగుతున్న మోసాల క‌ట్ట‌డికి మెటా చ‌ర్య‌లు ప్రారంభించింది. Facebook, Instagramలో ఫేషియ‌ల్ రిక‌గ్నీష‌న్ టెక్నాల‌జీని ప్రయోగాత్మకంగా ప‌రీక్షించింది. సెల‌బ్రిటీలు మాట్లాడుతున్న‌ట్టుగానే ప్రక‌ట‌న‌ల రూపంలో ప్ర‌జ‌ల్ని మోసం చేస్తున్న‌ సెలెబ్ బైట్ స్కాంల‌ కట్టడే ఈ కొత్త ఫీచ‌ర్ ల‌క్ష్యం. త్వరలో దీన్ని యాడ్ రివ్యూ సిస్టంలో ప్రవేశపెట్టనుంది.

News October 23, 2024

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఇప్పటికే ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు, చెత్తపై పన్ను రద్దు నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. కొత్త రేషన్ కార్డులు, రేషన్ డీలర్ల నియామకం, వాలంటీర్ల సర్వీసు కొనసాగింపుపై చర్చించే అవకాశముంది. 13కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీ, ఆలయాల్లో పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ ప్రతిపాదనలపై క్యాబినెట్ నిర్ణయం తీసుకోనుంది.

News October 23, 2024

గంజాయి కాల్చేందుకు స్టేషన్‌కే వెళ్లారు!

image

వారందరూ మైనర్లు, విద్యార్థులు. కేరళలోని త్రిస్సూర్ నుంచి మున్నార్ వరకూ టూర్ వెళ్తున్నారు. దారిలో భోజనం కోసం బస్సు ఆగినప్పుడు ఇద్దరు కుర్రాళ్లు గంజాయి బీడీల్ని తాగాలనుకున్నారు. అగ్గిపెట్టె లేకపోవడంతో పక్కనే ఉన్న బిల్డింగ్‌లోకి వెళ్లి అడిగారు. తీరా చూస్తే అది ఎక్సైజ్ పోలీస్ స్టేషన్. పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్ చేసి జువెనైల్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.