News October 10, 2025
జక్కన్న సినిమాల్లో మీ ఫేవరెట్ ఏది?

దర్శకధీరుడు రాజమౌళి బర్త్ డే సందర్భంగా ఆయన తీసిన సినిమాల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఆయన 12 సినిమాలు తీస్తే ప్రతీది బ్లాక్‌బస్టరే. టాలీవుడ్‌లోని పలువురు యంగ్ హీరోలకు ఆయన కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చారు. స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, సై , ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కంక్లూజన్, RRR సినిమాల్లో మీ ఫేవరెట్ ఏంటి? ఎందుకు? COMMENT
Similar News
News October 10, 2025
ట్రంప్‌కు ‘నో’బెల్.. పాక్ గొంతులో వెలక్కాయ!

పాక్‌కు ప్రతిచోటా భంగపాటే ఎదురవుతోంది. Op సిందూర్‌తో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నారు. SMలో ఫేక్ ఫొటోలతో నవ్వులపాలయ్యారు. వైట్‌హౌస్‌కెళ్లిన అసిఫ్ మునీర్, షెహబాజ్ షరీఫ్ ప్రెసిడెంట్ ట్రంప్‌తో ఫొటోలకు పోజులిచ్చి డాంబికాలకు పోయారు. శాంతిదూతంటూ నోబెల్‌కు సిఫార్సు చేశారు. తీరాచూస్తే నార్వే కమిటీ వారినసలు పట్టించుకోనే లేదని తెలియడంతో వారి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టైందని SMలో నెటిజన్లు నవ్వేస్తున్నారు.
News October 10, 2025
నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

AP నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు అరెస్ట్ అయ్యారు. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఆయనను గన్నవరంలో అదుపులోకి తీసుకున్నారు. 23 మందిని ఈ కేసులో నిందితులుగా పేర్కొనగా జనార్దన్ రావును ఏ-1గా చేర్చారు. కొద్దిరోజుల క్రితం ములకలచెరువులో నకిలీ మద్యం తయారుచేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. జనార్దన్ రావు తన అనుచరులతో కలిసి కల్తీ మద్యం తయారుచేసి, ప్రభుత్వ వైన్స్‌లకు సరఫరా చేసినట్లు తేల్చారు.
News October 10, 2025
మహిళలను అరెస్టు చేయాలంటే..!

దేశంలో మహిళల రక్షణ, ఆత్మగౌరవం కాపాడేందుకు పలుచట్టాలున్నాయి. వాటిలో ఒకటి.. అరెస్టు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 43(5) ప్రకారం.. సూర్యోదయంలోపు, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మహిళను అరెస్టు చేయరాదు. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో అరెస్టు తప్పదనుకుంటే ముందుగా మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి. అరెస్ట్ చేయడానికి వచ్చిన టీమ్‌లో మహిళా పోలీసు అధికారి తప్పనిసరిగా ఉండాలి. <<-se>>#WOMENLAWS<<>>