News October 25, 2024

ఇండియాలో ఏ భాష వినియోగం ఎక్కువ?

image

దేశంలోని చాలా రాష్ట్రాల్లో హిందీ భాష వినియోగంలో ఉంది. ఓ నివేదిక ప్రకారం దాదాపు 52.82 కోట్ల మంది హిందీ మాట్లాడతారు. బెంగాలీని 9.72కోట్ల మంది మాట్లాడితే 8.30 కోట్ల మంది మరాఠీలో సంభాషిస్తారు. ఇక 8.11 కోట్ల మంది తెలుగు, 6.90 కోట్ల మంది తమిళం మాట్లాడుతున్నారు. 5.54 కోట్ల మంది గుజరాతీ, 5.07 కోట్ల మంది ఉర్దూ, కన్నడ భాషను 4.37 కోట్లు, 3.75 కోట్ల మంది ఒడియా, మలయాళం మాట్లాడేవారు 3.48 కోట్ల మంది ఉన్నారు.

Similar News

News December 22, 2025

వంటింటి చిట్కాలు మీకోసం

image

* పంచదార డబ్బాలో కొన్ని లవంగాలు వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి.
* అల్లం, వెల్లుల్లి ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే పేపర్ బ్యాగ్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.
* పెనాన్ని రెండు గంటలపాటు వేడినీటిలో ఉంచి తర్వాత నిమ్మ చెక్కతో రుద్దితే జిడ్డు వదిలి పోతుంది.
* గారెలు, బూరెలు వంటివి చేసేటప్పుడు నూనె చిందకుండా ఉండాలంటే నూనెలో కాస్త నెయ్యి వేస్తే సరిపోతుంది.

News December 22, 2025

‘ధురంధర్’ కలెక్షన్లు ఎంతో తెలుసా?

image

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధురందర్’ మూవీ కలెక్షన్లలో దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటివరకు రూ.790.75 కోట్లు వసూలు చేసినట్లు INDIA TODAY తెలిపింది. ఇవాళ రూ.800 కోట్లు క్రాస్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు కేవలం ఇండియాలోనే ఈ మూవీ రూ.555.5 కోట్ల నెట్ సాధించినట్లు వెల్లడించి. దీంతో యానిమల్ లైఫ్ టైమ్ కలెక్షన్ల(రూ.553 కోట్లు)ను దాటేసిందని పేర్కొంది.

News December 22, 2025

గాలిలో ఉండగా ఆగిన విమానం ఇంజిన్

image

ఢిల్లీ నుంచి ముంబైకి బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇవాళ ఉ.6.10 గంటలకు టేకాఫ్ కాగా కొద్దిసేపటికే కుడి వైపు ఇంజిన్ ఆగిపోయింది. దీంతో వెంటనే పైలట్లు అప్రమత్తమై విమానాన్ని తిరిగి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేసింది.