News September 12, 2025
ఏ సమయంలో ఏ మంత్రం చదవాలంటే?

ఆర్థిక సమస్యలు వేధించినప్పుడు: కనకధార స్తోత్రం
ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు: దుర్గా సప్తశతి
శక్తి సన్నగిల్లినప్పుడు: హనుమాన్ చాలీసా
కుటుంబ కలహాలు ఉన్నప్పుడు: గణేశ అథర్వశీర్షం
న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు: సుందరకాండ
మనస్సు అశాంతిగా ఉన్నప్పుడు: శివాష్టకం
మార్గం తప్పినట్లు అనిపించినప్పుడు: విష్ణు సహస్రనామం
Similar News
News September 12, 2025
ప్రధాని మోదీ మణిపుర్ పర్యటన ఖరారు

PM మోదీ ఈనెల 13 నుంచి 15 వరకు 5 రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మిజోరం, మణిపుర్, అస్సాం, వెస్ట్ బెంగాల్, బిహార్‌లో 3 రోజుల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మొత్తం రూ.71,850 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. బిహార్‌లో మఖానా బోర్డు లాంచ్ చేస్తారు. బిహార్‌లో రూ.36,000 కోట్లు, మిజోరంలో రూ.9,000 కోట్లు, మణిపుర్‌లో రూ.8,500 కోట్లు, అస్సాంలో రూ.18,350 కోట్లతో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
News September 12, 2025
మహిళలూ వీటి గురించి తెలుసుకోండి

ప్రస్తుతకాలంలో ఉద్యోగం చేసే మహిళల సంఖ్య పెరిగింది. వచ్చే జీతం నుంచి సంపదని సృష్టించడం నేర్చుకోవాలి. సిప్, మ్యూచువల్ ఫండ్స్ గురించి బ్యాంకుకు వెళ్లి అడిగితే వాళ్లే వివరాలిస్తారు. గోల్డ్ బాండ్స్ కొని చూడండి. కొంతకాలానికి వడ్డీ వస్తుంది. ఆరోగ్య, జీవిత బీమాలు తీసుకోండి. భవిష్యత్తుకు తగ్గట్లు ప్రణాళికలు, ఉద్యోగంలో ఎదిగే అవకాశాలు చూడాలి. ప్రస్తుత ఉద్యోగం కాకుండా మరో ఆదాయ వనరు గురించీ ఆలోచించాలి.
News September 12, 2025
ఈ ఓటీటీలోనే ‘మిరాయ్’ స్ట్రీమింగ్

టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ నటించిన పాన్ ఇండియా ఫాంటసీ చిత్రం ‘మిరాయ్’ OTT హక్కులను జియో హాట్‌స్టార్ దక్కించుకుంది. 6 నుంచి 8 వారాల థియేటర్ స్క్రీనింగ్ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వొచ్చని సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉండనుందని ‘మిరాయ్’ మూవీ ఎండ్ కార్డులో ప్రకటించారు. ‘జైత్రయ’ అనే టైటిల్‌ను వెల్లడించగా ఇందులో నటుడు రానా విలన్‌గా నటిస్తారని టాక్ వినిపిస్తోంది.