News October 16, 2024

ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?

image

దాదాపు రెండేళ్లుగా ఇద్దరు స్టార్లు బిగ్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఎట్టకేలకు వీరి సినిమాలు రిలీజ్ కానుండటంతో అభిమానుల్లో ఆత్రుత నెలకొంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబోలో ‘గేమ్ ఛేంజర్’ (JAN 10), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో ‘పుష్ప-2’ (DEC 6) సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాల నుంచి సాంగ్స్, టీజర్స్ విడుదలయ్యాయి. మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారో కామెంట్ చేయండి.

Similar News

News October 16, 2024

గిల్‌తో ఓపెనింగ్ చేయించొద్దు: అనిల్ కుంబ్లే

image

నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరమయ్యే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌కు అనిల్ కుంబ్లే కీలక సూచన చేశారు. రోహిత్ స్థానంలో గిల్‌తో ఓపెనింగ్ చేయించవద్దని, అతడిని మూడో స్థానంలోనే కొనసాగించాలని అన్నారు. జైస్వాల్‌కు ఓపెనింగ్ జోడీగా KL రాహుల్‌ను పంపిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. రాహుల్ పరిస్థితులకు తగ్గట్లుగా ఆడగలరని, గిల్ పొజిషన్‌ను ఛేంజ్ చేయడం అవసరం లేదన్నారు.

News October 16, 2024

అందుకే రేస్ కార్ల జోలికి వెళ్లట్లేదు: నాగచైతన్య

image

తనకు చిన్నతనం నుంచి రేసింగ్ అంటే చాలా ఇష్టమని హీరో నాగచైతన్య చెప్పారు. కొత్త రకం బైక్, కారు ఏది కనిపించినా వెంటనే డ్రైవ్ చేసేవాడినని తెలిపారు. సినిమాలతో బిజీగా మారడంతో ఆ అలవాటును తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. వేగంగా వెళ్లొద్దని సన్నిహితులు సూచించడంతో రేసింగ్‌కు దూరమైనట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ చిత్రంలో నటిస్తున్నారు.

News October 16, 2024

ఒమర్ అబ్దుల్లాకు శుభాకాంక్షలు: మోదీ

image

జమ్మూకశ్మీర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఒమర్ అబ్దుల్లాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, అందుకు ఒమర్‌తో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో NC, కాంగ్రెస్ కూటమి మెజార్టీ స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.