News May 10, 2024
భారతిగారు మా ఇద్దరిలో ఎవర్ని నరికేయిస్తారో?: సునీత

పులివెందులలో అవినాశ్‌కు పోటీ లేకుండా ఉండేందుకే వైఎస్ వివేకాను హత్య చేయించారని ఆయన కుమార్తె సునీత ఆరోపించారు. ‘వివేకాకు జగన్‌ను ఎదిరించి మాట్లాడే సత్తా ఉంది కాబట్టే చంపారు. భారతికి ఇంకా ఎవరినైనా హత్యలు చేయాలన్న ప్లాన్ ఉందా? ఆమె నన్ను నరికేయిస్తారా.. లేక షర్మిలను నరికేయిస్తారా అన్నది తెలీదు. నేనైతే నా వీలునామాను నా పిల్లలకు రాసిచ్చేశాను. నాకు ఎప్పుడైనా ఏమైనా కావొచ్చు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Similar News
News February 2, 2026
ఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్: భారత్, అఫ్గాన్ మధ్య సెమీఫైనల్

ఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై 58 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-2 నుంచి భారత్, ఇంగ్లండ్ సెమీస్‌కు అర్హత సాధించాయి. గ్రూప్-1 నుంచి ఆసీస్, అఫ్గానిస్థాన్ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఫిబ్రవరి-3న జరిగే తొలి సెమీఫైనల్‌లో ఆసీస్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఫిబ్రవరి 4న భారత్, అఫ్ఘాన్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది.
News February 2, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB 02, సోమవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.12 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.26 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 2, 2026
చట్టాన్ని ఉల్లంఘిస్తే సహించేది లేదు: చంద్రబాబు

AP: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడటంలో రాజీపడే ప్రసక్తే లేదని, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరినీ వదలి పెట్టమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ‘ఏపీ రాజకీయాలను నేరమయం చేసిన సంస్కృతి వైసీపీదే. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ప్రతిపక్షం తట్టుకోలేకపోతోంది. ఆ పార్టీ పాలన అంతా చట్టరహితంగా సాగింది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిబంధనలు అందరికీ ఒకటే’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.


