News January 14, 2025
పవన్ ‘OG’ సినిమా ఏ OTTలోకి వస్తుందంటే?

పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ మూవీ విడుదలై థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఓటీటీలో అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనుంది. దీనితో పాటు నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, మ్యాడ్ స్క్వేర్, సిద్ధూ జొన్నలగడ్డ ‘JACK’ ఓటీటీ రైట్స్‌ను కూడా సొంతం చేసుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.
Similar News
News January 4, 2026
$17 ట్రిలియన్ల సంపదే లక్ష్యం.. మదురో అరెస్ట్ వెనుక అసలు కథ ఇదేనా?

వెనిజులా అధ్యక్షుడు మదురోను బంధించడంలో ఆ దేశంలోని 303 బిలియన్ బారెల్స్ ఆయిల్ నిక్షేపాలను కైవసం చేసుకోవడమే అమెరికా అసలు ప్లాన్ అనే చర్చ జరుగుతోంది. మార్కెట్ రేట్ ప్రకారం వీటి విలువ $17.3 ట్రిలియన్లని అంచనా. ఇందులో సగం రేటుకు అమ్మినా $8.7 ట్రిలియన్లు వస్తాయి. ఇది జపాన్ GDP కంటే 4 రెట్లు ఎక్కువ. 12 గంటల్లో చైనా, అమెరికా మినహా ప్రపంచ దేశాలన్నింటి కంటే ఎక్కువ సంపదను US తన గుప్పిట్లోకి తెచ్చుకుంది.
News January 4, 2026
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)నవీ ముంబైలో 6 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే(JAN 6) ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/B.Tech/BSc(Engg.) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉంటే అప్లై చేసుకోవచ్చు. ట్రైనీ ఇంజినీర్లకు గరిష్ఠ వయసు 28ఏళ్లు కాగా.. ప్రాజెక్టు ఇంజినీర్లకు 32 ఏళ్లు (రిజర్వేషన్ గలవారికి సడలింపు). ట్రైనీ Engg.కు JAN 16న, ప్రాజెక్ట్ Engg.కు JAN 20న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: bel-india.in
News January 4, 2026
5 రోజులే పని చేస్తాం: బ్యాంక్ ఉద్యోగులు

బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 రోజులు మాత్రమే పనిచేసేలా వెసులుబాటు కల్పించాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ‘ప్రపంచమంతా వారానికి 4 రోజుల పని విధానం వైపు అడుగులేస్తుంటే బ్యాంకు ఎంప్లాయిస్ 24×7 పనిచేస్తున్నారు. 5 రోజుల పని విధానానికి ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ ఒప్పుకుంది. దీనిని ప్రభుత్వం ఆమోదించాలి’ అని పేర్కొంది. కాగా Xలో 5DayBankingNow హ్యాష్‌ట్యాగ్ ట్రెండవుతోంది.


