News August 20, 2024

వినేశ్ ఫొగట్ ఏ పార్టీలో చేరొచ్చంటే?

image

సన్నిహిత వర్గాలు చెబుతున్నట్టు రాజకీయాల్లోకి వస్తే <<13899861>>వినేశ్ ఫొగట్<<>> ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తికరంగా మారింది. ఆమె కాంగ్రెస్‌లో చేరొచ్చని అంచనా. ఎందుకంటే ఆమె కొన్నాళ్లుగా బీజేపీ నేత బ్రిజ్‌భూషణ్‌పై పోరాడుతున్నారు. అదే పార్టీలోని బబితపై పోటీచేస్తారని సమాచారం. పైగా హరియణా కాంగ్రెస్ నేత, MP దీపేంద్ర హుడా ఆమెకు మార్గనిర్దేశం చేస్తున్నారు. మొన్న బలాలి వరకు ఆయనే స్వయంగా ర్యాలీ తీయించారు. మీ కామెంట్.

Similar News

News November 25, 2025

NGKL: ప్రజావాణిలో 14 ఫిర్యాదులు: ఎస్పీ

image

నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ పాటిల్ సంగ్రామ్ జీ సింగ్ సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను ప్రత్యక్షంగా విన్నారు. మొత్తం 14 ఫిర్యాదులను స్వీకరించగా, వాటిలో 11 భూమి సంబంధిత అర్జీలు ఉన్నాయి. చట్ట ప్రకారం సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు.

బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్: సుందర్

image

గువాహటి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమేనని భారత ఆల్‌రౌండర్ <<18375894>>వాషింగ్టన్<<>> సుందర్ అన్నారు. పరుగులు చేయకుండా ఎక్కువ సేపు నియంత్రించలేరని చెప్పారు. ‘ఇదేమీ బ్యాటింగ్‌కు కష్టమైన పిచ్ కాదు. ట్రూ వికెట్. ఇలాంటివి ఇండియాలో అరుదుగా ఉంటాయి. క్రీజ్‌లో నిలబడితే రన్స్ వస్తాయి’ అని తెలిపారు. 6 వికెట్లు తీసిన జాన్సెన్‌కు అసాధారణ బౌన్స్ రాలేదని, అతడు ఎత్తుగా ఉండటం వల్ల గుడ్ లెంత్‌లో బౌలింగ్ చేశారని పేర్కొన్నారు.