News February 3, 2025

‘తీన్మార్ మల్లన్న ఏ పార్టీ?’

image

TG: కాంగ్రెస్ MLC నవీన్ కుమార్(తీన్మార్ మల్లన్న) ఇటీవల చేసిన వ్యాఖ్యలు జనాల్లో గందరగోళానికి తెరలేపాయి. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై పార్టీ ఇప్పటికీ స్పందించకపోవడం ఏంటని జనాలు చర్చించుకుంటున్నారు. అధికారపార్టీ నేతగా ఉండి సొంత పార్టీపైనే విమర్శలు చేయడం ఏంటని విస్తు పోతున్నారు. దీంతో ఆయన ఏ పార్టీ నేత అని పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Similar News

News February 3, 2025

ఇది రాహుల్ అవివేకానికి నిదర్శనం: కిషన్ రెడ్డి

image

యూపీఏ ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎన్డీఏ ప్రభుత్వానికి ఆపాదించడం రాహుల్ గాంధీ అవివేకానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో 2.9 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగితే ఎన్డీఏ పాలనలో ఒక్క 2024లోనే 4.9 కోట్లు సృష్టించినట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొందని Xలో తెలిపారు. వివిధ రంగాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనతో పోలిస్తే NDA ప్రభుత్వంలోనే ఉపాధిలో వృద్ధి ఉందని వెల్లడించారు.

News February 3, 2025

వీటి పూర్తి పేర్లు మీకు తెలుసా?

image

నిత్యం ఏదోచోట మనం వినియోగించే వస్తువుల కంపెనీల ఫుల్‌ఫామ్స్ చాలా మందికి తెలియదు. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం. TVS- తిరుక్కురుంగుడి వెంగారం సుందరం, SYSKA- శ్రీ యోగి సంత్ కృపా అనంత్, WIPRO- వెస్ట్రన్ ఇండియా పామ్ రిఫైన్డ్ ఆయిల్స్ లిమిటెడ్, HDFC- హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, PAYTM- పే థ్రూ మొబైల్, MRF- మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి.

News February 3, 2025

వైసీపీ ‘ఫీజు పోరు’ మార్చి 12కు వాయిదా

image

AP: విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతూ, ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని వైసీపీ మార్చి 12కి వాయిదా వేసింది. ఈ మేరకు Xలో ప్రకటన రిలీజ్ చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరినా, ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొంది.