News July 24, 2024
ఏ రీరిలీజ్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు?

టాలీవుడ్ బ్లాక్ బస్టర్లు మరోసారి థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న ‘ఇంద్ర’ రీరిలీజ్ కానుంది. రవితేజ-రాజమౌళి కాంబోలో వచ్చిన ‘విక్రమార్కుడు’ ఈనెల 27న, మహేశ్ బాబు నటించిన ఐకానిక్ మూవీ ‘మురారీ’ ఆగస్టు 9న, పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ SEP 2న థియేటర్లలో మరోసారి రిలీజ్ కానున్నాయి. అక్కినేని నాగార్జున – RGV కాంబోలో వచ్చిన ‘శివ’ ఆగస్టు 29న రీరిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
Similar News
News December 4, 2025
ఖమ్మంలో 10నుంచి 12 వరకు బాలోత్సవం పోటీలు

ఖమ్మం: విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు మంచికంటి హాల్లో బాలోత్సవం నిర్వహించనున్నట్లు కన్వీనింగ్ కమిటీ ప్రకటించింది. బ్రోచర్లు అందని పాఠశాలలు కూడా ఈ ప్రకటనను ఆహ్వానంగా భావించి, తమ విద్యార్థులను పంపవచ్చు. సబ్-జూనియర్ల నుంచి సీనియర్ల వరకు స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్, నృత్యం వంటి పలు విభాగాల్లో పోటీలు ఉంటాయి. ఎంట్రీల కోసం 94903 00672ను సంప్రదించాలని కోరారు
News December 4, 2025
OTTలోకి మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్

‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. టామ్ క్రూజ్, హేలే అట్వెల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఆగస్టులో రెంటల్ పద్ధతిలో విడుదల చేయగా తాజాగా ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంటే చూడొచ్చు. ఈ చిత్రం ఈ ఏడాది మేలో విడుదలైంది.
News December 4, 2025
థైరాయిడ్ ట్యూమర్స్ గురించి తెలుసా?

థైరాయిడ్ గ్రంథి పనితీరుపైనే మనిషి జీవక్రియలు ఆధారపడి ఉంటాయి. ఇంతటి ప్రధానమైన థైరాయిడ్ గ్రంథిలో కొన్నిసార్లు ట్యూమర్స్ ఏర్పడతాయి. గొంతు భాగంలో వాపు/ గడ్డ ఏర్పడినట్లు కనిపిస్తుంది. ఈ వాపు అనేది ఆహారం తీసుకునేటప్పుడు లేదా మింగేటప్పుడు పైకీ కిందకీ కదులుతుంది. కానీ ఎటువంటి నొప్పి, ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. కణితి పరిమాణం పెరిగినప్పుడు ఆహారం తీసుకుంటుంటే పట్టేసినట్లుగా అనిపిస్తుంది.


