News June 6, 2024

రాహుల్ గాంధీ ఏ సీటును వదులుకుంటారు?

image

వయనాడ్, రాయ్‌బరేలీలో రాహుల్ ఏ స్థానాన్ని వదులుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. వయనాడ్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF బలంగా ఉండగా, రాయ్‌బరేలీ కాంగ్రెస్‌కు కంచుకోటగా కొనసాగుతోంది. రాహుల్ రాయ్‌బరేలీ వదులుకుంటే ఉపఎన్నికలో ప్రియాంకను బరిలోకి దింపే ఛాన్స్ ఉంది. ఎన్నికల ముందు జైరాం రమేశ్ కూడా ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించడంతో రాహుల్ ఈ స్థానాన్నే వదులుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News January 27, 2026

తల్లి వద్దే భావోద్వేగాలు.. ఎందుకంటే?

image

పిల్లలు తమ కోపాన్ని, ఏడుపును ఎక్కువగా తల్లి ముందే చూపిస్తుంటారు. దీనికి కారణం అమ్మపై ఉన్న నమ్మకమేనని నిపుణులు చెబుతున్నారు. ‘తాము ఎలా ప్రవర్తించినా తల్లి వదిలి వెళ్లదని, ఆమె వద్దే తమకు రక్షణ ఉంటుందని వారు భావిస్తారు. పిల్లలు అమ్మ దగ్గరే అన్ని భావోద్వేగాలనూ స్వేచ్ఛగా బయటపెడతారు. ఇది వారి మధ్య ఉన్న బలమైన అనుబంధానికి గుర్తు. అందుకే అరిస్తే కోప్పడకుండా వారిని అర్థం చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.

News January 27, 2026

కళ్ల కింద ముడతలు తగ్గాలంటే?

image

అందంగా కనిపించాలంటే మేకప్ వేస్తే సరిపోదు ముఖంపై ముడతలు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కళ్ల కింద ముడతలు వ‌ృద్ధాప్య ఛాయలకు సంకేతాలు. వీటిని తగ్గించాలంటే రెండు చేతుల చూపుడూ, మధ్య వేళ్లను ముందుగా కంటికొలను దగ్గర పెట్టి….చూపుడు వేలుని మాత్రం నెమ్మదిగా మర్దన చేస్తూ కొన దగ్గరకు తీసుకెళ్లాలి. ఈ సమయంలో మధ్య వేలితో చర్మాన్ని బిగుతుగా పట్టి ఉంచాలి. ఇలా కనీసం రెండు నిమిషాలైనా చేయాలి.

News January 27, 2026

భానుచందర్ ఇప్పుడెలా ఉన్నారో చూడండి!

image

సీనియర్ నటుడు భానుచందర్ లేటెస్ట్ లుక్ బయటకొచ్చింది. తాను తీస్తోన్న సినిమాలో నటించేందుకు భానుచందర్ ఓకే చెప్పారంటూ ఓ యువ డైరెక్టర్ ఇన్‌స్టాలో ఫొటో పోస్ట్ చేయగా వైరలవుతోంది. అందులో తెల్లటి గడ్డంతో స్లిమ్‌గా అయిపోయిన భానుచందర్‌ని చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. నిరీక్షణ సినిమాతో సినీ ప్రేమికులకు దగ్గరైన ఆయనను చాలా కాలం తర్వాత చూసి ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయనకు 73ఏళ్లు.