News April 5, 2024

8 కులాల వ్యక్తులు గెలిచిన సెగ్మెంట్ ఏదంటే?

image

APలో రాజమండ్రి అర్బన్‌ సెగ్మెంట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. 8 కులాల వ్యక్తులు గెలిచిన ఏకైక నియోజకవర్గం ఇదే. కమ్మ- ప్రభాకర్ చౌదరి(1952, 67), బుచ్చయ్య చౌదరి(1983, 85, 94, 99), కాపు-వీరభద్రరావు(1962), సత్యనారాయణ(2014), రెడ్డి- ACY రెడ్డి(1989), కొప్పుల వెలమ- ఆదిరెడ్డి భవాని(2019), బ్రాహ్మణ-నాగేశ్వరరావు(1955), వైశ్య-సత్యవతి(1978), తూర్పు కాపు-రౌతు సూర్యప్రకాశ్(2004,09), పద్మశాలి-మల్లికార్జునరావు(1972).
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News April 23, 2025

పవన్ కళ్యాణ్ ‘OG’ రిలీజ్ అప్పుడేనా?

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5న ఈ మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, DVV దానయ్య నిర్మిస్తున్నారు.

News April 23, 2025

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కన్నుమూత

image

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కీత్ స్టాక్‌పోల్ (84) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా తరఫున 43 టెస్టులు, 6 వన్డేలు ఆడిన ఆయన 7 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు చేశారు. 18 వికెట్లు పడగొట్టారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 167 మ్యాచుల్లో 10,100 రన్స్, 148 వికెట్స్ సాధించారు. ఆయన మృతి పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా సంతాపం ప్రకటించింది.

News April 23, 2025

ఉగ్రదాడి అనంతరం సరిహద్దుకు పాక్ విమానాలు?

image

పహల్గామ్‌లో ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌లోని కరాచి నుంచి రెండు ఎయిర్ ఫోర్స్ సరఫరా విమానాలు ఉత్తర సరిహద్దుకు చేరుకున్నాయని Xలో పోస్టుల వైరలవుతున్నాయి. వాటికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను షేర్ చేసింది. వీటిలో మిలిటరీ సామగ్రి తరలించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం అవుతోంది. ఈ సరిహద్దు జమ్ముాకశ్మీర్‌కు సమీపాన ఉంటుంది. అయితే ఈ విషయంపై ఎటువంటి అధికారిక ధ్రువీకరణ లేదు.

error: Content is protected !!