News March 27, 2024
ఆ రికార్డును ఏ జట్టు బద్దలు కొడుతుంతో!

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విశ్వరూపం చూపించి ఆర్సీబీ రికార్డును బ్రేక్ చేశారు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక (263), అత్యల్ప(49) పరుగుల రికార్డు బెంగళూరు పేరుపై ఉండగా ఇవాళ SRH అత్యధిక పరుగుల(277) రికార్డును బద్దలు కొట్టింది. ఇక RCB అత్యల్ప పరుగుల చెత్త రికార్డును ఏ జట్టు బద్దలు కొడుతుందని మీరు భావిస్తున్నారు. కామెంట్ చేయండి..
Similar News
News January 16, 2026
TODAY HEADLINES

⭒ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు
⭒ మెగా సిటీలుగా తిరుపతి, విశాఖ, అమరావతి: CM CBN
⭒ దేశ భద్రత విషయంలో TG ముందుంటుంది.. ఆర్మీ అధికారులతో CM రేవంత్
⭒ రాయలసీమ లిఫ్ట్‌ను KCRకు జగన్ తాకట్టు పెట్టారు: సోమిరెడ్డి
⭒ TG: ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్‌కు స్పీకర్ క్లీన్ చిట్
⭒ BMCలో బీజేపీదే హవా.. ఎగ్జిట్ పోల్స్ అంచనా
⭒ U19 WC: USAపై IND గెలుపు
News January 16, 2026
నితీశ్‌పై తీవ్ర విమర్శలు.. తిప్పికొట్టిన విహారి

భారత జట్టుకు ఆల్‌రౌండర్‌గా పనికిరాడంటూ నితీశ్ రెడ్డిపై వస్తున్న విమర్శలపై హనుమ విహారి Xలో స్పందించారు. ’22 ఏళ్ల వయసులో బ్యాటింగ్, పేస్ బౌలింగ్ చేసే క్రికెటర్లు దేశంలో ఎవరైనా ఉన్నారా? నితీశ్ ఇప్పటివరకు 3 వన్డేల్లో 7 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. 4 T20ల్లో 3W, 4th సీమర్‌గా 10 టెస్టుల్లో 8W పడగొట్టాడు. మెల్బోర్న్‌లో సెంచరీ చేశాడు. అది ఇప్పటికీ చాలా మందికి నెరవేరని కల’ అంటూ నితీశ్‌కు మద్దతునిచ్చారు.
News January 15, 2026
కనుమ రోజున ప్రయాణాలు చేయవద్దా? దీని వెనుక ఉద్దేశం?

కనుమ రోజున ప్రయాణాలు చేయొద్దనే మాట ఎన్నో ఏళ్లుగా వినిపిస్తోంది. ఈ రోజును పశువుల పండుగగా జరుపుతారు. పంటల సాగులో సాయపడిన పశువులను పూజిస్తారు. అయితే పూర్వం ఎడ్ల బండ్లపై ప్రయాణాలు చేసే వారు కాబట్టి ఈ ఒక్కరోజైనా ఎద్దులను కష్టపెట్టొద్దనే ఉద్దేశంతో ప్రయాణాలు వద్దని చెప్పేవారని పండితులు గుర్తుచేస్తున్నారు. కాగా ప్రస్తుత కాలంలో ఈ నియమం వల్ల కుటుంబమంతా కలిసి గడిపేందుకు ఎక్కువ సమయం ఉంటుందంటున్నారు.


