News July 17, 2024
శాంతిభద్రతలపై రేపు శ్వేతపత్రం విడుదల

AP: శాంతిభద్రతల అంశంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియాకు సీఎం వివరాలు వెల్లడిస్తారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గడిచిన ఐదేళ్లలో నమోదైన అక్రమ కేసులు, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, కోడి కత్తి, వివేకా హత్య కేసులు, తదితర అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది.
Similar News
News January 8, 2026
TODAY HEADLINES

☛ 2027 నాటికి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యం: CM CBN
☛ అమిత్ షాతో చంద్రబాబు భేటీ.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ
☛ ఏపీలో ‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపు.. బెనిఫిట్ షో టికెట్ రూ.1000
☛ TGలో మున్సిపల్ ఎన్నికలు.. ఈనెల 16న ఓటర్ల తుది జాబితా విడుదల
☛ TGలో సంక్రాంతి స్పెషల్ బస్సుల్లో ఛార్జీల పెంపు
☛ ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేత
☛ T20 WC: భారత్లోనే బంగ్లాదేశ్ మ్యాచులు!
News January 8, 2026
Official: ‘జన నాయగన్’ విడుదల వాయిదా

విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అనివార్య కారణాలతో విడుదలను నిలిపివేస్తున్నట్లు KVN ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం అవుతూ వచ్చింది. కొన్ని సన్నివేశాలు తొలగించాలని సూచించిన సెన్సార్ బోర్డు, మార్పుల తర్వాత స్పందించలేదు. దీంతో నిర్మాణ సంస్థ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.
News January 8, 2026
ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలిదశ

దేశంలో ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలిదశ ప్రారంభం కానుంది. ఇందులోభాగంగా ఇళ్ల లిస్టింగ్ జరుగుతుందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుందని చెప్పింది. ప్రతి రాష్ట్రానికి 30రోజుల వ్యవధి ఉంటుందని తెలియజేస్తూ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రెండో విడతలో జనాభా లెక్కలు సేకరించనుంది. ఇది 2027 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఇందుకోసం కేంద్రం ₹11,718 కోట్ల బడ్జెట్ను ఆమోదించింది.


