News July 17, 2024
నేరాలు, ఘోరాలపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలి: VSR

AP: కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలపై కూడా శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా అని YCP MP విజయసాయిరెడ్డి ఎక్స్‌లో ఎద్దేవా చేశారు. దీనిపై ప్రభుత్వంలోని పెద్దలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ‘అధికారం ఇస్తే 24 గంటల్లో న్యాయం అన్నారు. సుగాలి ప్రీతి, చిత్తూరు జిల్లా మైనర్ బాలిక కేసు ఏమైంది? YCP కార్యకర్తలపై హింసకు పాల్పడుతూ రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News November 26, 2025
HOCLలో 72 పోస్టులు.. అప్లై చేశారా?

కేరళలోని హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్ లిమిటెడ్(<
News November 26, 2025
SBI సరికొత్త రికార్డు.. షేర్ వాల్యూ@రూ.999

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI సరికొత్త రికార్డు నమోదుచేసింది. ఇవాళ సంస్థ స్టాక్ దాదాపు 3 శాతం పెరగడంతో విలువ ఆల్‌టైమ్ హై రూ.999కి చేరింది. స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.1000 కూడా దాటొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా సంస్థ వ్యాపార విలువ రూ.100 లక్షల కోట్లకు చేరినట్లు ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
News November 26, 2025
‘కమ్లా పసంద్’ ఓనర్ కోడలు ఆత్మహత్య

పాపులర్ పాన్ మసాలా కంపెనీ ‘కమ్లా పసంద్’ ఓనర్ కమల్ కిషోర్ కోడలు దీప్తి చౌరాసియా(40) ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ వసంత్ విహార్‌లోని తన ఫ్లాట్‌లో ఆమె ఉరి వేసుకొని కనిపించారు. దీప్తి గదిలో పోలీసులు సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో భర్త హర్‌ప్రీత్ చౌరాసియా పేరును రాసినట్లు తెలుస్తోంది. 2010లో దీప్తి-హర్‌ప్రీత్ వివాహం చేసుకున్నారు. వారికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నారు.


