News May 26, 2024

కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరికి అనుమతి లేదు?

image

✒ గన్‌మెన్లు ఉన్న వ్యక్తులు, మంత్రులు, MPలు, MLAలు, మేయర్లు, మున్సిపల్, ZP ఛైర్మన్లు, ప్రభుత్వ-ఎయిడెడ్ సంస్థల్లో పనిచేసేవారు, GOVT గౌరవ వేతనం పొందేవారు, రేషన్ డీలర్లు, అంగన్‌వాడీ ఉద్యోగులు ఏజెంట్లుగా కూర్చోకూడదు.
✒ ప్రభుత్వ ఉద్యోగులు ఏజెంట్లుగా వ్యవహరించినట్లు తేలితే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం శిక్షార్హులవుతారు.
✒ 3 నెలల జైలు శిక్ష లేదా ఫైన్, ఒక్కోసారి రెండూ కలిపి విధించే అవకాశం ఉంది.

Similar News

News January 17, 2025

మంచు బ్రదర్స్ ట్వీట్స్ వార్

image

‘రౌడీ’ సినిమాలోని డైలాగ్‌తో Xలో విమర్శలు చేసిన విష్ణు ట్వీట్‌కు మనోజ్ కౌంటర్ ఇచ్చారు. ‘సింహం అవ్వాలని ప్రతి కుక్కకు ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావ్’ అని విష్ణు ట్వీట్ చేశారు. కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణంరాజు గారిలా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకు ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్’ అని మనోజ్ కౌంటర్ ఇచ్చారు.

News January 17, 2025

VIRAL: అప్పట్లో రూ.18కే తులం బంగారం

image

మార్కెట్‌లో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. నిత్యం రూ.వందల్లో పెరుగుతూ అప్పుడప్పుడూ తగ్గుతూ మధ్యతరగతి ప్రజలను ఊరిస్తుంటుంది. అసలు వందేళ్ల క్రితం పది గ్రాములు బంగారం ధర ఎంతుందో తెలుసా? 1925లో దీని ధర రూ.18.75 ఉండగా 2025లో రూ.80,620గా ఉంది. 1959లో తొలిసారి రూ.100 దాటి రూ.102.56కి 1980లో తొలిసారి వెయ్యి దాటి రూ.1330, 1985లో రూ.2130, 1996లో రూ.5160, 2007లో రూ.10,800 కాగా 2022లో రూ.52వేలకు చేరింది.

News January 17, 2025

రేపు గ్రూప్-2 ‘కీ’ విడుదల

image

TG: గ్రూప్-2 ‘కీ’ రేపటి నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో వస్తుందని టీజీపీఎస్సీ పేర్కొంది. ఈనెల 18 నుంచి 22న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తమ అభ్యంతరాలను తెలపొచ్చని వెల్లడించింది. కాగా డిసెంబర్ 15, 16న గ్రూప్-2 పరీక్ష జరిగింది.