News May 19, 2024
ఐదో విడత బరిలో అభ్యర్థులు ఎందరంటే?

రేపు దేశంలోని 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. యూపీలో 14, మహారాష్ట్రలో 13, వెస్ట్ బెంగాల్లో 7, బిహార్‌లో 5, ఒడిశాలో 5, ఝార్ఖండ్‌లో 3, జమ్మూకశ్మీర్‌లో 1, లద్దాక్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరగనుంది. కాగా ఐదో విడత ఎన్నికల్లో 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Similar News
News January 23, 2026
గోదావరి పుష్కరాలకు 10 కోట్ల మంది!

AP: 2027 జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని CM CBN అధికారులను ఆదేశించారు. 3వ సారి ఈ పుష్కరాలు నిర్వహిస్తుండడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. ‘పోలవరం’ పనులు ఈలోగా పూర్తిచేయాలన్నారు. పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. పుష్కరాలకు 10కోట్ల మంది వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
News January 23, 2026
వంట గది ఏ వైపున ఉండాలి?

వంటగది ఇంటి ఆగ్నేయ మూలలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. దీనివల్ల సరిపడా గాలి, వెలుతురు వచ్చి ఇల్లాలు అలసట లేకుండా వంట చేయగలదని చెబుతున్నారు. ‘వంటగదిలో పూజ గది ఉండటం శ్రేయస్కరం కాదు. శుభ్రంగా ఉంచుకోవాలి. విరిగిన, పగుళ్లు ఇచ్చిన గాజు, పింగాణీ పాత్రలను ఉంచకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే వంట రుచికరంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 23, 2026
అవసరమైతే కేటీఆర్‌ను మళ్లీ పిలుస్తాం: సజ్జనార్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణపై సిట్ చీఫ్ సజ్జనార్ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. విచారణ పూర్తిగా చట్టబద్ధంగా జరుగుతోందన్నారు. కేటీఆర్‌ను ఒంటరిగానే విచారించామని, ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించినట్లు చెప్పారు. సాక్షులను ప్రభావితం చేయొద్దని, అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని కేటీఆర్‌కు చెప్పామన్నారు. కాగా ఇవాళ కేటీఆర్‌ను సిట్ 7 గంటలకు పైగా ప్రశ్నించింది.


