News May 18, 2024

EAPCET టాప్ ర్యాంకర్లు ఎవరంటే?

image

తెలంగాణ EAPCET ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్ విభాగంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన జ్యోతిరాదిత్య ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీలో మదనపల్లెకు చెందిన ప్రణీత తొలిస్థానంలో నిలిచారు. ఈఏపీ సెట్‌కు 3,32,251 మంది హాజరయ్యారని, అందులో ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618, అగ్రికల్చర్, ఫార్మసీ 91,633 మంది విద్యార్థులున్నారని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

Similar News

News November 22, 2025

‘పండ్లు, కూరగాయల సాగుతో ఎక్కువ లాభం’

image

నారింజ పంట ఉత్పత్తికి నాణ్యమైన విత్తనాల కోసం నాగ్‌పూర్‌లో రూ.70 కోట్లతో క్లీన్‌ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. భూసార పరీక్షలు, నాణ్యమైన విత్తనాలను అందజేయడంపై ICAR సైంటిస్టులు దృష్టిపెట్టాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే పండ్లు, కూరగాయ పంటలను సాగు చేయాలని.. యంత్రాలు, డ్రిప్ ఇరిగేషన్‌ వాడకంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.

News November 22, 2025

ఇంగ్లండ్ ఆలౌట్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?

image

యాషెస్ సిరీస్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 164 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లిష్ బ్యాటర్లను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సక్సెస్ అయ్యారు. పోప్(33), డకెట్(28), జేమీ స్మిత్(15), అట్కిన్సన్(37), కార్స్(20) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4, స్టార్క్, డగ్గెట్ చెరో 3 వికెట్లు తీశారు. విజయం కోసం ఆస్ట్రేలియా 205 పరుగులు చేయాల్సి ఉంటుంది.

News November 22, 2025

iBOMMA కేసు.. సీఐడీ ఎంట్రీ

image

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అతనిపై తెలంగాణ సైబర్ క్రైమ్‌ పోలీసులు 10కి పైగా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే మనీలాండరింగ్ అంశంపై ఈడీ ఆరా తీయగా, తాజాగా CID కూడా ఎంట్రీ ఇచ్చింది. గేమింగ్, బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేసిన వ్యవహారంపై వివరాలను అధికారులు సేకరించారు. ప్రస్తుతం అతడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు 3 రోజులుగా విచారిస్తున్నారు.