News June 14, 2024
సూపర్-8 చేరే మరో 3 జట్లేవి?

టీ20 వరల్డ్ కప్లో ఇప్పటికే 5జట్లు సూపర్-8కు చేరాయి. గ్రూప్ A నుంచి ఇండియా, గ్రూప్ B నుంచి ఆస్ట్రేలియా, గ్రూప్ C నుంచి అఫ్ఘానిస్థాన్, వెస్టిండీస్, గ్రూప్ D నుంచి సౌతాఫ్రికా బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఖాళీగా ఉన్న 3 స్థానాల కోసం USA, పాకిస్థాన్, స్కాట్లాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ పోటీ పడుతున్నాయి. కెనడా, ఐర్లాండ్ పోటీలో ఉన్నా నెగటివ్ రన్రేట్ వల్ల అవి సూపర్8 చేరేది దాదాపు అసాధ్యమే.
Similar News
News October 17, 2025
కోహ్లీ వరల్డ్ రికార్డు సృష్టిస్తాడా?

స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 7 నెలల తర్వాత ఈనెల 19న AUSతో తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ సిరీస్లో తను వరల్డ్ రికార్డు నెలకొల్పే అవకాశముంది. 3 మ్యాచ్ల్లో ఒక్క సెంచరీ చేసినా 148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో సింగిల్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా నిలుస్తారు. సచిన్ టెస్టుల్లో 51 సెంచరీలు చేయగా విరాట్ వన్డేల్లో 51 శతకాలు బాదారు. మరో సెంచరీ చేస్తే సచిన్ రికార్డును అతడు అధిగమిస్తారు.
News October 17, 2025
జపాన్ మాజీ ప్రధాని కన్నుమూత

జపాన్ మాజీ ప్రధాని టొమిచి మురయమా(101) అనారోగ్యంతో కన్నుమూశారు. ఫాదర్ ఆఫ్ జపాన్ పాలిటిక్స్గా పిలవబడే మురయమా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ వెల్లడించింది. ఆయన 1994 నుంచి 1996 వరకు ప్రధానిగా పనిచేశారు. వరల్డ్ వార్-2 సమయంలో ఆసియాలో జపాన్ చేసిన దారుణాలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది.
News October 17, 2025
సీతాఫలం.. మహిళల ఆరోగ్యానికి వరం

సీతాఫలంలో విటమిన్లు A, C, B6, ఖనిజాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని మహిళలు తింటే గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, చర్మ నిగారింపు, హిమోగ్లోబిన్ మెరుగుపడుతుంది. షుగర్, బీపీ, ఒత్తిడి కంట్రోల్ అవుతుంది. ఇందులోని కాపర్ గర్భిణుల్లో పిండం అభివృద్ధిలో సహాయపడుతుంది. వాంతులు, మూడ్ స్వింగ్స్ అదుపులో ఉంటాయి. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
#ShareIt