News October 11, 2025
టాప్-100 కుబేరుల్లో తెలుగు వారు ఎవరంటే?

ఫోర్బ్స్ ఇండియా <<17957747>>జాబితాలో<<>> దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి(రూ.88,000 కోట్లు) 25వ స్థానంలో ఉన్నారు. మేఘా ఇంజినీరింగ్ చీఫ్స్ పీపీ రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి 70వ స్థానంలో, జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జున రావు 83వ, అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ ప్రతాప్ సి.రెడ్డి 86వ, హెటిరో గ్రూప్ ఛైర్మన్ పార్థసారథి 89వ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అధినేత సతీష్ రెడ్డి 91వ స్థానంలో ఉన్నారు.
Similar News
News October 12, 2025
2027 వరల్డ్ కప్ ఆడాలని ఉంది: జడేజా

తనను ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై ముందే చర్చించారని టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ జడేజా పేర్కొన్నారు. ‘నా సెలక్షన్‌పై మేనేజ్మెంట్, కోచ్, కెప్టెన్, సెలక్టర్లు డెసిషన్ తీసుకున్నారు. కారణాలేంటో నాకు చెప్పారు. 2027 WCకంటే ముందు కొన్ని వన్డేలు ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడల్లా పర్ఫార్మ్ చేసి వరల్డ్ కప్ టీమ్‌లో ప్లేస్ సాధించే ప్రయత్నం చేస్తా. ప్రపంచ కప్ కలను నిజం చేసుకుంటాను’ అని తెలిపారు.
News October 12, 2025
జో బైడెన్‌కు రేడియేషన్ థెరపీ

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ 82 ఏళ్ల వయసులో ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆయనకు ప్రస్తుతం వైద్యులు రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ‘జో బైడెన్ అగ్రెసివ్ ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అది ఆయన ఎముకలకు పూర్తిగా పాకింది’ అని ఈ ఏడాది మే నెలలో అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
News October 12, 2025
‘PM మీరు చాలా గ్రేట్’.. మోదీకి ట్రంప్ మెసేజ్

అమెరికా రాయబారి సెర్గియో గోర్ PM మోదీని కలిశారు. ఆ సమయంలో మోదీ, US అధ్యక్షుడు ట్రంప్ కలిసున్న ఫొటోను బహూకరించారు. దానిపై ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మీరు చాలా గ్రేట్’ అని రాసిన ఒక స్పెషల్ నోట్ ఉంది. అలాగే సెర్గియో కూడా భేటీ అనంతరం ట్రంప్‌కు PM మోదీ ‘గ్రేట్ పర్సనల్ ఫ్రెండ్’ అని పేర్కొన్నారు. ఆయన విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశీ కార్యదర్శి మిస్రీ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్‌నూ కలిశారు.