News June 7, 2024
జనసేన, బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు ఎవరు?

AP: NDAలో భాగస్వామ్యం ఉన్న జనసేనకు కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మచిలీపట్నం నుంచి బాలశౌరి, కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ జనసేన ఎంపీలుగా గెలవగా, సీనియర్ అయిన బాలశౌరి పేరును జనసేనాని ఫిక్స్ చేసే అవకాశం ఉంది. అటు రాష్ట్రంలో బీజేపీ నుంచి ముగ్గురు ఎంపీలు గెలిచారు. రాజమండ్రి నుంచి గెలిచిన పురందీశ్వరి, అనకాపల్లి నుంచి గెలిచిన సీఎం రమేశ్ పేర్లను ఆ పార్టీ అధిష్ఠానం పరిశీలించనుంది.
Similar News
News October 24, 2025
సమస్యలను దూరం చేసే వాస్తు దిక్కును ఎలా ఎంచుకోవాలి?

ఇల్లు కట్టుకునేటప్పుడు/కొనేటప్పుడు ఆ ఇంటి దిక్కు మనకు మంచి చేస్తుందా లేదా అని చూసుకోవడం చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. జన్మరాశి ఆధారంగా మన ఇంటికి ఏ దిక్కు అనుకూలమో ముందే తెలుసుకోవచ్చని సూచించారు. ‘జన్మ రాశి, నక్షత్రం తెలియకపోయినా, పేరు బలాన్ని ఉపయోగించి ఏ దిక్కు శుభప్రదమో తెలుసుకోవచ్చు. వాస్తు విషయంలో దిక్కుకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి’ అని అన్నారు. <<-se>>#Vasthu<<>>
News October 24, 2025
న్యూస్ అప్డేట్స్

➤ J&Kలో రాజ్యసభ ఎన్నికల ఫలితాలు రిలీజ్. 3 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్, క్రాస్ ఓటింగ్‌తో ఒక స్థానంలో BJP గెలుపు
➤ బిహార్‌లో BJP-JDU కూటమి CM అభ్యర్థి నితీశ్ కుమార్ అని స్పష్టం చేసిన PM మోదీ.
➤ AP: తిరుపతిలోని స్వర్ణముఖి నదిలో నలుగురు యువకులు గల్లంతు. ఒకరి మృతదేహం లభ్యం.
➤ TG: జూబ్లీహిల్స్ తుది ఓటర్ లిస్ట్ రిలీజ్. మొత్తం 4,01,365 మంది ఓటర్లు.
News October 24, 2025
పవన్ కళ్యాణ్‌తో హైడ్రా రంగనాథ్ భేటీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం అయ్యారు. మంగళగిరి క్యాంప్ ఆఫీస్‌లో ఈ భేటీ జరిగింది. సుమారు రెండు గంటల పాటు వారిద్దరూ పలు అంశాలపై మాట్లాడుకున్నారు. భేటీకి గల కారణాలు తెలియాల్సి ఉంది.


