News March 23, 2024

కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఎవరికి లాభం? – 1/3

image

ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ సంచలనమైంది. దీనిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అరెస్ట్‌తో కేజ్రీవాల్‌కే లబ్ధి అని కొందరు, బీజేపీకే లాభం అనేది మరికొందరు అనుకుంటున్నారు. అయితే ఏ పక్షానికీ పూర్తిగా లబ్ధి ఉండదనేది విశ్లేషకులు మాట. ప్రతిపక్ష నేతల అరెస్ట్‌తో సింపతీ వస్తుందనే గ్యారంటీ లేదంటున్నారు. అందుకు గతంతో జరిగిన అరెస్ట్‌లే ఉదాహరణగా చెబుతున్నారు.

Similar News

News April 20, 2025

అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల

image

అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్(మ్యూజిషియన్స్) పోస్టులకు <>నోటిఫికేషన్ విడుదలైంది.<<>> జూన్ 10 నుంచి 18 వరకు బెంగళూరులో రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు పాల్గొనవచ్చు. రేపటి నుంచి మే 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2005 జనవరి 1 నుంచి 2008 జులై 1 మధ్యలో జన్మించి, టెన్త్ పాసైన వారు అర్హులు.
వెబ్‌సైట్:https://agnipathvayu.cdac.in/

News April 20, 2025

హసీనా అరెస్టుకు ఇంటర్‌పోల్‌ సాయం కోరిన బంగ్లా

image

బంగ్లాదేశ్ మాజీ పీఎం షేక్ హసీనా సహా 12 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఆ దేశ పోలీసులు ఇంటర్‌పోల్‌ను కోరారు. బంగ్లా చీఫ్ అడ్వైజర్‌గా యూనస్ బాధ్యతలు చేపట్టాక హసీనాతో పాటు మాజీ మంత్రులు, ఆర్మీ అధికారులపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇంటర్‌పోల్ రెడ్ నోటీస్ ఇస్తే ఆ వ్యక్తులు ఏ దేశంలో ఉన్నా అరెస్ట్ చేసేందుకు వీలవుతుంది. కాగా హసీనా గతేడాది AUG 5 నుంచి భారత్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.

News April 20, 2025

ధోనీ పరిస్థితులను తలకిందులు చేయగలడు: రోహిత్

image

ధోనీ సామర్థ్యం, అనుభవాన్ని రోహిత్ కొనియాడారు. ధోనీతో అంత ఈజీ కాదని చెప్పారు. ‘మహీ ఎన్నో మ్యాచులకు కెప్టెన్‌గా చేశారు. ఎన్నో ట్రోఫీస్ గెలిపించారు. అలాంటి వ్యక్తి ప్రత్యర్థిగా ఉంటే మనం రిలాక్స్ అవ్వకూడదు. మనం వారిపై ఆధిక్యంలో ఉన్నా.. ఒక సడెన్ మూవ్‌తో మనల్ని ప్రెజర్‌లోకి నెట్టగలడు. ధోనీ ఉంటే.. బ్యాటింగ్ అయినా, ఫీల్డింగ్ అయినా కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు.

error: Content is protected !!