News March 23, 2024
కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఎవరికి లాభం? – 3/3

ఇక తెలుగు రాష్ట్రాల్లో BRS MLC కవిత అరెస్ట్ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను స్వలాభానికి వాడుకుంటోందని బీజేపీపై ఆరోపణలు ఉన్నా వాటి ప్రభావం ఉండకపోవచ్చనేది విశ్లేషకుల మాట. అరెస్ట్‌లు సరైన కారణాలతోనే జరుగుతున్నా ఏజెన్సీల వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. దీనికి ఏజెన్సీలు చెక్ పెట్టకుంటే అది వాటి విశ్వసనీయతపై ప్రభావం చూపొచ్చని అంటున్నారు.
Similar News
News November 5, 2025
IIM షిల్లాంగ్‌లో ఉద్యోగాలు

<
News November 5, 2025
BSNL ఫైబర్.. బేసిక్ ప్లాన్ కేవలం రూ.399!

సరసమైన రీఛార్జ్ ప్యాక్స్‌తో యూజర్లను ఇంప్రెస్ చేస్తోన్న ప్రభుత్వ రంగ సంస్థ BSNL ఇప్పుడు అతి తక్కువ ధరకే ఫైబర్ బేసిక్ ప్లాన్‌ను అందిస్తోంది. BSNL తమ ఫైబర్ బేసిక్ ప్లాన్‌ను కేవలం ₹399గా నిర్ణయించింది. దీంతో 60 Mbps వేగంతో నెలకు 3300 GB డేటాను పొందగలరు. ఆ తర్వాత 4Mbps వేగంతో డేటా లభిస్తుందని సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్లో మొదటి నెల ఉచితం కాగా.. తొలి 3 నెలలు ప్లాన్‌పై అదనంగా ₹100 తగ్గింపు ఉంటుంది.
News November 5, 2025
బంధంలో బ్యాలెన్స్ ముఖ్యం

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతో అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్నట్లవుతుంది. సున్నితమైన విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మీ జీవితం మీకు తెలీకుండానే చేజారే అవకాశం ఉంది. బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్డ్గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.


