News July 17, 2024

చాందీపురా వైరస్ ఎవరికి సోకుతుందంటే?

image

<<13643966>>చాందీపురా<<>> వైరస్ గురించి ఓ వైద్యుడు వివరించారు. ‘చందీపురా అనేది మహారాష్ట్రలోని ఒక గ్రామం. 1965లో ఇక్కడ తొలి కేసు నిర్ధారణ అయింది. జ్వరం, తలనొప్పి, విరేచనాలు దీని లక్షణాలు. కాగా తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛ, స్పృహ కోల్పోవడం, మరణం సంభవించవచ్చు. ఇసుక ఈగలు, పేలు, దోమల వల్ల సోకుతుంది. ఇది అంటువ్యాధి కాదు. 9 నెలల – 14 ఏళ్ల పిల్లలపై అధిక ప్రభావం ఉంటుంది. దీనిని నిరోధించేందుకు వ్యాక్సిన్ లేదు’ అని తెలిపారు.

Similar News

News January 7, 2026

NZB: సీఎంకి వినతిపత్రం అందించిన టీపీసీసీ అధ్యక్షుడు

image

భీంగల్ మండలం రహత్‌నగర్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్, కాలేజీని మంజూరు చేయాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందించారు. HYDలో సీఎంని కలిసి జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి పనులపై చర్చించారు. విద్యా సౌకర్యాల మెరుగుదలకు సీఎం సానుకూలంగా స్పందించారని మహేష్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, NZB అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.

News January 7, 2026

జీవీఎంసీ అడిషనల్ కమిషనర్‌గా నల్లనయ్య

image

జీవీఎంసీ అడిషనల్ కమిషనర్‌గా పి. నల్లనయ్య‌ను నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేస్తున్న నల్లనయ్య పదోన్నతిపై బదిలీ కాగా జీవీఎంసీలో అదనపు కమిషనర్‌గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.