News March 19, 2024
మైక్ సరిచేసుకోలేని వారు రాష్ట్రాన్ని నడుపుతారా?: అంబటి
AP: మూడు పార్టీల సభ అట్టర్ ప్లాప్ అయిందని, ముగ్గురు కలిసి పోటీ చేసినా జగన్‌ను ఓడించలేరని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ‘ప్రధాని పాల్గొన్న సభనే విజయవంతం చేయలేకపోయారు. చంద్రబాబు జీవితమంతా అభద్రతాభావమే. మైక్ సరిచేసుకోలేని వారు రాష్ట్రాన్ని నడుపుతారా? బాబు అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఉండవు. జనాలు ఆయనను నమ్మే పరిస్థితిలో లేరు’ అని అంబటి అన్నారు.
Similar News
News November 24, 2024
రచిన్ రవీంద్రను తిరిగి దక్కించుకున్న చెన్నై
ఓపెనింగ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను CSK రూ.4కోట్లకు కొనుగోలు చేసింది. బేస్ ప్రైజ్ రూ.1.50 కోట్లతో వేలంలోకి వచ్చిన ఇతడి కోసం పంజాబ్, చెన్నై పోటీ పడ్డాయి. గత సీజన్లో చెన్నై తరఫున ఆడిన ఇతను 161 స్ట్రైక్ రేట్‌తో 222 పరుగులు చేశారు.
News November 24, 2024
SRHకు హర్షల్ పటేల్.. రూ.8కోట్లు
పేస్ బౌలర్ హర్షల్ పటేల్‌ను SRH రూ.8కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లో పంజాబ్ తరఫున ఆడిన ఇతను రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చారు. ఐపీఎల్ కెరీర్లో హర్షల్ పటేల్ 8.7 ఎకానమీతో 135 వికెట్లు తీశారు. ఇతని బెస్ట్ 4-25. డెత్ ఓవర్లలో ఇతను వేరియేషన్లతో బ్యాటర్లను ఇబ్బంది పెడతారు.
News November 24, 2024
అమ్ముడుపోని వార్నర్
డేవిడ్ వార్నర్ వేలంలో అమ్ముడుపోలేదు. మూడో సెట్లో ఆయన పేరు రాగా తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తిని చూపించలేదు. గత సీజన్లో ఢిల్లీ తరఫున ఆడిన వార్నర్ ఇటీవలి ప్రదర్శన అంతంతమాత్రమే. ఇక ఆస్ట్రేలియా తరఫున ఆయన అన్ని ఫార్మాట్లలోనూ రిటైర్ కావడం కూడా ఫ్రాంచైజీల అనాసక్తికి కారణం కావొచ్చని అంచనా.