News November 25, 2024

‘శైలజ’ మృతికి కారణం ఎవరు?

image

TG: ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై విద్యార్థిని శైలజ(16) <<14706403>>మృతి చెందడం <<>>అందరినీ కలచివేస్తోంది. ప్రభుత్వ ఆశ్రమ స్కూలులో చదివి పేదరికాన్ని జయించాలన్న ఆమె కలలు ఛిద్రమయ్యాయి. అక్కడ అందించిన ఆహారం తిని ఆస్పత్రి పాలై, పేదరికంతో కార్పొరేట్ వైద్యానికి నోచుకోలేదు. వైద్యానికి శరీరం సహకరించక ఎంతో భవిష్యత్తును వదిలేసి ఈ లోకాన్ని వీడింది. ఆమె మృతికి కారణం ఎవరు? ప్రభుత్వమా? పేదరికమా?

Similar News

News November 26, 2024

లోక్‌సభ స్పీకర్ కుమార్తె వివాహానికి హాజరైన రేవంత్

image

TG: ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్‌కు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. సీఎం రేవంత్ వెంట మంత్రి ఉత్తమ్ కుమార్, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

News November 26, 2024

SRH: జట్టు ఎలా ఉంది?

image

ఐపీఎల్ మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూకుడుగా వ్యవహరించి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. మొత్తం 20 మందిని తీసుకుంది. జట్టు: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, పాట్ కమిన్స్, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ, అభినవ్ మనోహర్, అధర్వ తైడే, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, సమర్జీత్ సింగ్. ఉనద్కత్, కార్స్, అన్సారి, అనికేత్ వర్మ, సచిన్ బేబి.

News November 26, 2024

అంబానీ బలగం ఇదే

image

రిటెన్షన్లు, వేలంలో కలిపి ముంబై ఇండియన్స్ 22 మంది ఆటగాళ్లను తీసుకుంది.
జట్టు: రోహిత్, బుమ్రా, హార్దిక్, బౌల్ట్, తిలక్, సూర్య, దీపక్ చాహర్, నమన్ ధీర్, శాంట్నర్, రాజ్ బవా, పుతుర్, రికెల్‌టన్, రాబిన్ మింజ్, షిర్జిత్, జాకబ్స్, అశ్వనీ కుమార్, ఘజన్‌ఫర్, టోప్లే, లిజాడ్, కర్ణ్ శర్మ, పెన్మత్స వెంకటసత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్.